Home » మాస్టర్, ఖైదీ, విక్ర‌మ్ సినిమాల్లో ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

మాస్టర్, ఖైదీ, విక్ర‌మ్ సినిమాల్లో ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

by AJAY
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుతం సౌత్ లో ఉన్న క్రేజీ డైరెక్ట‌ర్ ల‌లో లోకేష్ క‌న‌క‌రాజు ఒక‌రు. ఈ త‌మిళ యంగ్ డైరెక్టర్ త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రపిస్తున్నారు. ఖైదీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో లోకేష్ క‌న‌క‌రాజు సౌత్ ఇండస్ట్రీలోనే సంచ‌ల‌నం గా మారిపోయారు. లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన న‌గ‌రం సినిమా మొద‌ట‌గా తెలుగులో డ‌బ్ చేశారు.ఈ సినిమాలో సందీప్ కిష‌న్ రెజీనా హీరోహీరోయిన్ లుగా న‌టించారు. 2017లో విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

లోకేష్ క‌న‌క‌రాజ్ రెండో సినిమా ఖైదీ ఈ సినిమాలో కార్తీక్ హీరోగా న‌టించారు. ఖైదీ సినిమా విజ‌యంతో లోకేష్ క‌న‌క‌రాజ్ తమిళ స్టార్ హీరో విజ‌య్ తో సినిమా చేసే జాక్ పాట్ కొట్టేశాడు. ఆ సినిమానే రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మాస్ట‌ర్. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఆ అంచ‌నాల‌ను మాస్ట‌ర్ రీచ్ అవ్వ‌లేక‌పోయాడు. భారీ అంచాల న‌డుమ విడుద‌లై మాస్ట‌ర్ ఘోర‌మైన ఫ్లాప్ గా నిలిచింది.

Advertisement

ఈ సినిమా విడుద‌లైన అతి తక్కువ గ్యాప్ లోనే లోకేష్ క‌న‌క‌రాజు మ‌ళ్లీ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా విక్ర‌మ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటూ త‌మిళ స్టార్ లు సూర్య‌, విజ‌య్ సేతుప‌తి న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫ‌జిల్ కూడా న‌టించారు.

ఈ చిత్రంతో లోకేష్ క‌న‌క‌రాజు మరోసారి ప్రేక్ష‌కుల‌ను ఔరా అనిపించారు. దాంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఈ యంగ్ డైరెక్ట‌ర్ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే లోకేష్ క‌న‌క‌రాజు సినిమాల‌లో ఒక కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించ‌వ‌చ్చు. మాస్ట‌ర్ సినిమా మిన‌హా ఈ యంగ్ డైరెక్ట‌ర్ చేసిన సినిమాల‌న్నీ నైట్ మోడ్ లోనే ఉన్నాయి. అంతే కాకుండా మంచి విజ‌యం సాధించాయి.

ALSO READ : ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!

Visitors Are Also Reading