తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయిత గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వైవిధ్యభరిత పాత్రలో నటించగల వ్యక్తి తనికెళ్ల భరణి. శివ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలకు రచయిత గానూ, నటుడిగానూ చేశారు. దాదాపు 300 పైగా సినిమాల్లో నటించి దర్శకనిర్మాతలకు ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నాటకాల నుంచి నంది అవార్డుల దాకా ఎగిసిన ఆయన కెరీర్ గ్రాఫ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనికెళ్ల భరణి గారికి ఇద్దరు పిల్లలు కాగా కొడుకు మహాతేజ, కుమార్తె సౌందర్య లహరి. తనికెళ్ల భరణి గారు తన నివాసానికి కూడా తన కూతురు పేరు పెట్టుకున్నారు. అయితే తండ్రి సినిమారంగంలో గొప్ప స్థానానికి ఎదిగితే కొడుకు గొప్ప శాస్త్రవేత్త గా ఎదిగారు. చిన్నప్పటి నుంచే సామాన్య శాస్త్రం పై ఆసక్తి ఉన్న మహా తేజ ఆ ఆసక్తితోనే శాస్త్రవేత్తగా ఎదిగారు. తనికెళ్ల భరణి పేరు నిలబడుతూ ఉన్నతస్థాయిలో నిలిచారు. అయితే మహాతేజ భరణి అనుకోకుండా ఒక సినిమాలో హీరోగా కూడా నటించారు. ఆ సినిమా పేరే లవంగం. ఈ సినిమా హిట్టవ్వకపోగా, తనికెళ్ల భరణి గారు కూడా బాగా బాధ పడ్డారు. దీంతో నటనకు పూర్తిగా దూరమైన మహా తేజ తనకు ఆసక్తి ఉన్న రంగంలో గొప్ప స్థాయికి ఎదిగారు. ఇక ఆయనకు రీసెంట్ గా వివాహం జరిగింది. ఏదిఏమైనప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనికెళ్ల భరణి గారు రచయిత గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యభరితమైన పాత్రల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Advertisement
ALSO READ;
Advertisement
నేను హీరోగా చేస్తుంటే మిగితా హీరోలు అందరూ కలిసి…?
సమంతలా చేయడం నా వల్ల ఎప్పటికి కాదు…!