Home » సమంత సినిమాల్లోకి రాకముందే ఒక యాడ్ లో నటించిందని మీకు తెలుసా..!

సమంత సినిమాల్లోకి రాకముందే ఒక యాడ్ లో నటించిందని మీకు తెలుసా..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత అంటే తెలియని వారు ఉండరు. ఆమె తన నటన,అందంతో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకొని లైఫ్ ని చాలా బిజీగా గడుపుతోంది. తన వివాహానికి స్వస్తి చెప్పినప్పటి నుంచి ఈ అమ్మడు తన కెరీర్ పై మరింత దృష్టి సారించింది. ఓ వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరినీ అలరిస్తోంది. మరి అలాంటి ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ లో నటించింది. అదేమిటో ఓ సారి చూద్దాం..? ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రకథానాయికలుగా పేరుపొందిన ఎందరో ఒకప్పుడు యాడ్స్ లో, మోడల్ గా చేసిన వారే. మరికొందరు బుల్లితెరపై ముందుగా నటించి మంచి పేరు తెచ్చుకొని తర్వాత మెల్లిమెల్లిగా బిగ్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగి పోతున్నారు. గుర్తింపు వచ్చే వరకు కష్టపడి ఓ వైపు అందాన్ని కాపాడుకుంటూ, మరోవైపు ఎంతో కొంత సంపాదిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే సమంత. ఈమె సినిమాల్లోకి రాకముందు చిన్నచిన్న యాడ్స్ చేసేది. ఈ విధంగా చేస్తూ ముందుగా ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఈ అమ్మడుకు అడపాదడపా అవకాశాలు వచ్చినా పెద్దగా పేరు రాలేదు. దీంతో కొంత కాలం పాటు చాలా కష్టపడి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది.

Advertisement

Advertisement

ALSO READ;

మెగాస్టార్ చిరంజీవి క‌ల‌లు క‌న్న హాలీవుడ్ సినిమా మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

మహేష్ బాబు, రమేష్ బాబు లకు నందమూరి తారక రామారావు గారు చేసిన సహాయం గురించి తెలుసా ?

 

Visitors Are Also Reading