సినిమా రంగం పుట్టకముందే నాటక రంగాల్లో రాణించింది. నాటకాల్లో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి అమ్మగా, అమ్మమ్మగా బామ్మగా ఎన్నో సినిమాల్లో తన నటనతో కామెడీతో మనల్నీ ఎంతగానో అలరించిన అలనాటి నటీమణీ నిర్మలమ్మ మనందరికీ తెలిసే ఉంటారు.
Advertisement
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి ఎంతో మంది స్టార్ హీరో ల సినిమాల్లో అమ్మ, బామ్మ వంటి పాత్రల్లో ముందు నిర్మలమ్మ ప్రిఫర చేసే వారట. మన తెలుగు సినిమాల్లో 1000కి పైగా నటించిన అతి కొద్ది మందిలో నటీనటుల్లో నిర్మలమ్మ ఒకరు.
ఎటువంటి సీన్ అయినా ఎంతో సాధారణంగా నటించేస్తుంది. అదేవిధంగా ఈమె యాస కూడా ఈమె నటనకు సూట్ అవ్వడంతో మన తెలుగు ప్రేక్షకులు నిర్మలమ్మను బాగా ఆదరించారు. మయూరి, సీతారామరాజు సినిమాలు నంది అవార్డులను అందుకున్నారు. అందుకే నాగేశ్వరరావు అప్పట్లో నిర్మలమ్మ గురించి ఒక మాట అన్నారు. షూటింగ్ సమయంలో ఎవరో నటిగా కాకుండా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ అందరి బాధలను తెలుకునేదని, ఒక తల్లిలా మమ్మల్ని ఆదరించది అని, అందుకే సరదాగా మేమందరం ఆమెను నిర్మలమ్మ అని పిలుచుకుంటాం అంటూ నాగేశ్వరరావు చెప్పారు.
ఇకపోతే ఈమె షూటింగ్ లో చూసి ప్రొడక్షన్ మేనేజర్ జీవీ కృష్ణారావు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత డైరెక్టర్‌గా నిర్మలమ్మ ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడాడు. దానికి అందరూ ఒప్పుకున్నారు. అయితే నిర్మలమ్మ మాత్రం ఒక కండీషన్ పెట్టింది. నేను పెళ్లి అయ్యాక కూడా నటిస్తాను. దానికి ఓకే అయితే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. అందుకు ఆయన ఒప్పుకోవండంతో ఇద్దరూ ఒకటయ్యారు. పెళ్లి అయ్యాక నిర్మలమ్మ, కృష్ణారావు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరికి పిల్లలు కలుగలేదు. దానికి కాస్త డిప్రెషన్‌కి గురైన నిర్మలమ్మ అప్పుడు సినిమాలకు బ్రేకు తీసుకుంది. కొన్నాళ్లు ఎవ్వరికీ కనిపించలేదు.
Advertisement
తన భర్త కృష్ణారావుకు ప్రొడక్షన్ మేనేజర్ గా అవకాశాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఆదాయం సరిగ్గా లేక అప్పుడు చేసి చివరకు అన్ని అప్పులు తీర్చడానికి ఇద్దరూ నాటక రంగంపై దృష్టి పెట్టారు. అలా 1961లో విడుదలైన కృష్ణ ప్రేమ సినిమాలో నిర్మలమ్మ అవకాశం లభించడంతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత అస్సలు వెను తిరిగి చూసుకోలేదు. ప్రేమాభిషేకంలో శ్రీదేవి బామ్మగా మొదలైన ఈమె ప్రస్థానం ఎన్నో సినిమాల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ పాత్రలో ఒదిగిపోయి నటించి ఔరా అనిపించింది. నాగార్జున, హరికృష్ణ జంటగా నటించిన సీతారామరాజు సినిమాలో కోటశ్రీనివాసరావు అమ్మగా నాగమ్మ తరహాలో చేతిలో కర్ర పట్టుకుని విలనిజం పండించింది. మన నిర్మలమ్మ. చివరగా చిరంజీవి స్నేహం కోసం సినిమా తరువాత నిర్మలమ్మ పెద్దగా కనిపించలేదు.
నిర్మలమ్మకు పిల్లలు కలుగకపోవడంతో ఆమె కవిత అనే ఒక ఆడపిల్లను దత్తత తీసుకు ఆమెకు పెళ్లి చేసి దగ్గరుండి అన్ని బాగోగులు చూసుకుంది. ఈమె మనమడు విజయ్ మదాల ఇతన్ని నట వారసుడిగా పడమట సంధ్యారాగం అనే సినిమాలో గణపతి పాత్రలో ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఈయన పుట్టినప్పటి నుంచి అమెరికాలోనే ఉండడం వలన తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు. ఈయనకు శోభ అనే అమ్మాయితో పెళ్లి కాగా వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది. మనమడి పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డ నిర్మలమ్మ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది. ఎన్నో పాత్రలతో మనల్ని అలరించిన నిర్మలమ్మ 2009 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మృతి చెందారు.
Also Read : పుతిన్ ప్రేయసికి ఆ దేశంలో కష్టాలేనట..!