Home » megastar navy:మెగాస్టార్ చిరంజీవి నేవీలో చేశారని మీకు తెలుసా..ఇదిగో ప్రూఫ్..!!

megastar navy:మెగాస్టార్ చిరంజీవి నేవీలో చేశారని మీకు తెలుసా..ఇదిగో ప్రూఫ్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు హీరో చిరంజీవి.. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు.. అలాంటి చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆరు పదుల వయసులో కూడా ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నేవీలో చేశారని చాలామందికి తెలియదు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:మేక‌ర్స్ చేసిన ఆ త‌ప్పు వ‌ల్ల హిట్ 2 కు న‌ష్టాలు త‌ప్ప‌వా..? ఏం త‌ప్పు చేశారంటే..?

Advertisement

నేవీ డే సందర్భంగా మన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటోను పోస్ట్ చేశారు.. ఈ ఫోటో చిరంజీవి కాలేజ్ రోజుల్లో దిగినది. ఆ ఫోటోలో మెగాస్టార్ నేవీ యూనిఫామ్ లో ఉన్నారు. గత వారం గోవా ఎయిర్ పోర్ట్ లో తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిసారని చెప్పుకొచ్చారు చిరంజీవి. దీంతో తన పాత రోజులు మరోసారి గుర్తు చేసుకున్నారు. తను కాలేజీలో చదివే రోజుల్లో ఎన్ సీసీ క్యాండేట్ గా చేశానని ఇప్పటికే ఓసారి వెల్లడించారు చిరంజీవి.

1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్ భవన్ లో మార్చు పాస్టులో పాల్గొన్నారు అని తెలియజేశాడు.. ఈ మధ్యకాలంలో YNM కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సమయంలో మరోసారి తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి నేవీ డ్రెస్ లో దిగిన ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. మరి ఫోటోలో చిరు ఎలా ఉన్నారో మీరు కూడా ఓ కామెంట్ చేయండి.

also read:

Visitors Are Also Reading