Telugu News » చిరంజీవిపై విష ప్ర‌యోగం య‌త్నించార‌ని మీకు తెలుసా..?

చిరంజీవిపై విష ప్ర‌యోగం య‌త్నించార‌ని మీకు తెలుసా..?

by Anji

చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు రావ‌డానికి ద‌శాబ్ద కాలం ప‌ట్టింది. ఒక్కో ఇటుక పెట్టి ఇల్లు క‌ట్టిన‌ట్టు.. ఒక్కో అవ‌మానాన్ని దిగ‌మింగి స్టార్ అవ్వాల‌నే క‌సితో ఆయ‌న పైకి వ‌చ్చారు. ఎన్టీఆర్ మూడు ద‌శాబ్దాలుగా సినిమా ఇండ‌స్ట్రీని ఏలారు. ఆయ‌న‌తో పాటు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, శోభ‌న్‌బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు ఉన్నారు. ఇలాంటి త‌రుణంలో పైకి రావాలంటే కొత్త‌గా ఏదైనా చూపించాల‌నుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా ఫైట్స్ అయితే అంద‌రూ చేస్తారు. కాబ‌ట్టి కొత్త‌గా డ్యాన్స్‌ను ఎంచుకున్నాడు. అందుకే ఎక్కువగా మైకెల్ జాక్స‌న్ వీడియోలు చూస్తూ డ్యాన్స్ చేసేవారు.

Ads

ఓ ప్ర‌ముఖ హీరోయిన్ చిరంజీవిలో త‌న కారులో కూర్చుబెట్టుకోవ‌డానికి చాలా అవ‌మానంగా ఫీల్ అయింది. మొహం మీదే వేరే కారులో ర‌మ్మ‌ని చెప్పింది. మ‌రో ముగ్గురు హీరోయిన్లు అయితే చిరంజీవి లాంటి చిన్న‌స్టార్‌తో సినిమా చేయ‌బోమ‌ని చెప్పేశారు. అయినా ఎక్క‌డ ఛాన్స్ దొరికిన ఆయ‌న మాత్రం త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. ఆరోజుల్లో ఒక ద‌ర్శుకుడి చేతుల్లో ప‌డితే స్టార్ అయితార‌నే పేరుండేది. ఆయ‌న వెళ్లి ఓసారి త‌నను పెట్టి సినిమా తీయాల‌ని అడిగాడు. కానీ ఆయ‌న నీకు న‌ట‌న ఏమి వ‌చ్చు. కుప్పి గంతుల వేయ‌డం వ‌స్తే నువ్వు హీరోవి కాలేవ‌ని య‌ట‌కారం ఆడారు. ఆమాట‌లు విని చిరంజీవి ఏమాత్రం బాధ‌ప‌డ‌లేదు. ఆ అవ‌మానాన్ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకున్నారు. డైరెక్టర్ కాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి కూర్చుంటేనే న‌టుడిని చేస్తారు. కానీ చిరంజీవి గౌర‌వంగా దూరంగా నిల‌బ‌డి అడిగినా చాలా చీఫ్‌గా చూశారు. కానీ ఎన్టీఆర్ సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళ్లిన ఆ రేంజ్ న‌టుడు మ‌ళ్లీ రాలేదు.


ఆ స‌మ‌యంలో ఒక్కొక్క హిట్‌తో మెరుపువేగంతో దూసుకొచ్చాడు చిరంజీవి. కేవ‌లం త‌న టాలెంట్ ద్వారానే డైరెక్ట‌ర్ల‌ను త‌న‌వైపున‌కు తీసుకున్నాడు. అలా ఊహించ‌ని విధంగా కెర‌టంలా దూసుకొచ్చారు. ఖైదీ త‌రువాత చిరంజీవి ద‌శ మారిపోయింది. అంగ్రీ హీరోగానే కాకుండా డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దూస్తుండ‌డంతో చ‌రంజీవికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు అభిమానులు. ఆ క్ర‌మంలో చిరంజీవిని తొక్కేసేందుకు చాలా మంది ప్ర‌య‌త్నించారు. కానీ చిరంజీవి విద్య‌లు ఒక్క‌రోజులో వ‌చ్చిన‌వి కావు. అత‌న్నితొక్కేవారు కూడా లేరు. అప్ప‌టికే ఏడాదికి మూడు సూప‌ర్ హిట్‌లు, మ‌రో మూడు సాధార‌ణ హిట్లతో ఇండ‌స్ట్రీని దున్నేసే స్టేజీకి చేరి హీరో అయ్యాడు చిరంజీవి. అడ‌విదొంగ‌, విజేత‌, కిరాత‌కుడు, కొండ‌వీటిరాజా, దొంగ‌మొగుడు, చంటి అబ్బాయి ఇలా గ్యాబ్ లేకుండా హిట్‌ల మీద హిట్లు కొడుతూ ఉండ‌డంత ఆయ‌నంటే హిట్ అని కొంత మంది ఏకంగా చిరంజీవిని చంపేందుకే ప్ర‌య‌త్నించారు.

Also Read :  బాహుబ‌లిలో ఈ విష‌యాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..?


అప్ప‌టికే చిరంజీవి ఎక్క‌డ కూడా బ‌య‌ట ఓపెన్‌గా తినేవారు కాదు. చాలా జాగ్ర‌త్త‌గా ఉండేవారు. ముఖ్యంగా ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త తీసుకునేవారు. ఎందుకంటే ఏ కొత్త ప‌దార్థం తినాల‌న్నా భ‌య‌ప‌డేవారు. కొత్త ప్రాంతంలో ఏదైనా జ‌రిగితే సినిమా షూటింగ్‌లు ఆగిపోతాయి. చుట్టూ శ‌త్రువుల మ‌ధ్య ఉన్న చిరంజీవికి కెరీర్ అంటే భ‌యం ప‌ట్టుకుంది. అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఉండేవారు. ఇక ఆయ‌న‌కు ఎన్టీఆర్ త‌రువాత ఆ రేంజ్ పెర‌గ‌డంతో ఎక్క‌డ షూటింగ్ జ‌రిగినా ఫ్యాన్స్ వ‌చ్చే వారు. చిరంజీవి మొద‌టి నుంచి అభిమానుల‌ను త‌న‌వారిగా చూసేవారు. త‌న ఎదుగుద‌ల‌కు వాళ్లే కార‌ణ‌మ‌ని ఇప్ప‌టికీ ఫీల్ అవుతారు. అలాగే మ‌ద్రాస్‌లోని బేస్ కోర్టులో మ‌ర‌ణ‌మృదంగం సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. షూటింగ్ గ్యాబ్‌లో ఫ్యాన్స్ చాలా సేప‌టి నుంచి ఎదురుచూస్తున్నార‌ని అసిస్టెంట్ చెబితే వెళ్లి చేయి ఊపి న‌మ‌స్కారం చేసి రావాల‌నుకున్నాడు చిరంజీవి. గేట్ వ‌ద్ద‌కు వెళ్ల‌గానే అభిమాని వ‌చ్చి చిరంజీవి కాళ్ల‌మీద ప‌డిపోయాడు. సార్ ఇవ్వాళ నా పుట్టిన రోజు నేను కేకు క‌ట్ చేస్తాను. మీరు నా ప‌క్క‌న ఉండండి సార్ అని బ్ర‌తిమిలాడాడు. ఫ్యాన్స్ అడ‌గ‌డంతో చిరంజీవి కాద‌న‌లేక వెళ్లారు. కుర్రాడు కేకు క‌ట్ చేయ‌గానే చిరంజీవి చ‌ప్ప‌ట్లు కొట్టి శుభాకాంక్ష‌లు చెప్పారు. కానీ కేకు పీస్ తినాల‌ని బ‌ల‌వంతం చేశాడు. అయితే తాను షూటింగ్‌లో ఉన్నాన‌ని.. తిన‌కూడ‌దు అని చెప్పినా విన‌కుండా ఆ అబ్బాయి కేకు నోట్లోపెట్టాడు.

చిరంజీవి భ‌యంతో కేకును కింద‌కు ఉంచేశాడు. ఈ తోపులాట‌లో కేకు మొత్తం కింద ప‌డిపోయింది. కింద ప‌డిన కేకులో రంగు రంగుల ప‌దార్థాలు క‌నిపించాయి. వెంట‌నే దీంతో చిరంజీవి వేగంగా వెన‌క్కి వెళ్లి క‌డుక్కున్నాడు. ఇక షాట్‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా మేక‌ప్ అసిస్టెంట్ త‌న‌కు మేక‌ప్ వేస్తుండ‌గా చిరంజీవి అద్దంలో చూశాడు. త‌న పెదాలు బ్లూ క‌ల‌ర్‌లో ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. వెంటనే ఆ మేక‌ప్ మ్యాన్ సార్ లిప్‌స్టిక్ పెట్టాను. కానీ అది బ్లూ క‌ల‌ర్‌లో పెదాలు మారాయ‌ని చెప్పాడు. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు విష‌యం చెప్ప‌డంతో ఏమైనా ఫాయిజ‌న్ క‌లిపారేమోన‌ని భ‌య‌ప‌డ్డారు. వేగంగా ఆసుప‌త్రికి వెళ్లి చెక్ చేయించుకున్నాడు. అయితే విష ప‌దార్థం వ‌ల్ల‌నే ఇలా రంగులు మారుతుంద‌ని.. రాత్రి మొత్తం విషం శ‌రీరంలోకి వెళ్లినా ప్ర‌మాదం కాకుండా వాంతి అయ్యేలా చేశారు డాక్ట‌ర్లు. ఆ త‌రువాత ట్రీట్‌మెంట్ చేసి తెల్ల‌వార‌జామున ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని చెప్పారు.

బ్లూ క‌ల‌ర్‌లోకి మారిన పెదాలు తెల్లారే స‌రికి సాధార‌ణం అయ్యాయి. అప్ప‌టికే ఈ వార్త మీడియాకు లీక్ అయింది. జాతీయ మీడియాలో వ‌చ్చిన రెండ‌వ రోజు తెలుగు మీడియాలో కొన్ని సినిమా పేప‌ర్లు మాత్ర‌మే ఈ వార్త‌ను క‌వ‌ర్ చేశాయి. ఈ వార్త సినిమా ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌ల‌నమే సృష్టించింది. వాస్త‌వానికి ఆ ఘ‌ట‌న మ‌ద్రాస్‌లో జ‌ర‌గ‌డంతో మ‌న తెలుగు నాట పెద్ద‌గా చాలా మందికి తెలియ‌లేదు. కానీ ఆ వార్త ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఇదే ఘ‌ట‌న‌పై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌లు మాత్రం చిత్రీక‌రించారు. కానీ స్టార్‌గా ఎదిగిన చిరంజీవిని బ్రూస్‌లీ మాదిరిగా మార్చాల‌ని కుట్ర చేశార‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. బ‌డా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు చిరంజీవికి ధైర్యం చెప్పారు. తాము అండ‌గా ఉంటాం భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌నిగింది. ఆరోజు చిరంజీవి తెలివిగా వ్య‌వ‌హ‌రించాడు కాబ‌ట్టే ఆయ‌న బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని..లేక‌పోతే మెగాస్టార్ మ‌న‌కు ద‌క్కేవాడు కాదేమో. ఆ నాటి నుంచి కూడా ఆహార విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండేవారు చిరంజీవి. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తినేవారు కాదు. వాంతులు అయినా, ఫుడ్ పాయిజ‌నింగ్ అయినా క‌నీసం ఒక్క‌సారిగా మూడు సినిమాలు వాయిదా ప‌డ‌తాయి. అందుకే వేడిచేసిన నీరు క్యాన్‌లో తీసుకొని వెళ్లి తాగేవారు చిరంజీవి. అలా జాగ్ర‌త్త‌గా ఉన్నారు కాబ‌ట్టి ఆ విష ప్ర‌యోగం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఏది ఉన్నా క‌ష్ట‌ప‌డితే విజ‌యం ద‌క్కుతుంద‌న‌డానికి చిరంజీవి నిద‌ర్శం.

Also Read :  రాజ‌మౌళి ఇంట‌ర్ చ‌దువుపై ఆయ‌న భార్య సెటైర్లు…ఏమందంటే..!


You may also like