Telugu News » Blog » వర్మ జేడీ చక్రవర్తి ఇద్దరు ఒకే హిరోయిన్ ని ప్రేమించారా..?

వర్మ జేడీ చక్రవర్తి ఇద్దరు ఒకే హిరోయిన్ ని ప్రేమించారా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే  రాంగోపాల్ వర్మ మాత్రమే. సినిమాలతోనే కాదు ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటారు. అలాంటి రాంగోపాల్ వర్మ సినిమాలు అప్పట్లో ఒక ఊపు ఊపేవి. ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఈయన శిష్యులుగా చేసిన ఎంతోమంది  ప్రస్తుతం డైరెక్టర్లుగా మంచి హోదాలో ఉన్నారు.

Advertisement

  ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణవంశీ,అనురాగ్ కష్యప్, పూరి జగన్నాథ్.  కట్ చేస్తే రాంగోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు జెడి చక్రవర్తి.  ఈయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా.. సింగర్ గా.. ఎన్నో సినిమాలు చేశారు.  అలాంటి జెడి చక్రవర్తి ఆ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. వివరాల్లోకి వెళితే గులాబి, బొంబాయి ప్రియుడు, మనీ మనీ వంటి చిత్రాలతో ఎంతో గుర్తింపు సాధించిన జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

అయితే అప్పట్లో ఈయన జయసుధ ని గాఢంగా ప్రేమించారని అనేక వార్తలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంలో యాంకర్ మీరు కూడా రాంగోపాల్ వర్మ లాగే జయసుధ ని ప్రేమించారా అని అడిగితే మీరు ఏం మాట్లాడుతున్నారండి నేనొక్కడినే కాదు జయసుధను, శ్రీదేవిని చాలా మంది ప్రేమిస్తారు. టాలీవుడ్ లో ఈ హీరోయిన్స్ ని నేను రామ్ గోపాల్ వర్మ గారే ఇష్టపడుతున్నామా.. ఇంకా ఎవరు ఇష్టపడడం లేదా అంటూ క్వశ్చన్ వేశారు. ఏది ఏమైనప్పటికీ ఇంటర్వ్యూలో వారు ప్రేమించిన జయసుధ గురించి బయటకు రావడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Advertisement

You may also like