Telugu News » Blog » ఆ విషయంలో స్టార్ హీరోయిన్లు రాధా,రాధిక జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

ఆ విషయంలో స్టార్ హీరోయిన్లు రాధా,రాధిక జుట్టు పట్టుకొని కొట్టుకున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ హీరోలుగా చేసే సమయంలో అనేక మల్టీ స్టారర్ సినిమాలు వచ్చేవి. పదుల సంఖ్యలో మల్టీ స్టారర్ సినిమాలు విడుదల అయ్యేవి. ప్రస్తుతం ఈ ట్రెండు తగ్గిపోయింది కానీ అప్పట్లో ఎక్కువగా ఉండేది. అలనాడు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ప్రధాన కారణం ఎక్కువ మంది నటీనటులు ఉంటే ఎక్కువ మార్కెట్ చేసుకోవచ్చని దర్శకుల ఆలోచన. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మరోక స్టార్ హీరోతో కలిసి నటించడానికి ఒప్పుకునేవారు. అలాంటి సమయంలో ఆ ఇద్దరు స్టార్ల మధ్య అప్పుడప్పుడు వివాదాలు కూడా జరిగేవి. అలాంటి వివాదమే స్టార్ హీరోయిన్ రాధా, రాధిక విషయంలో జరిగింది. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

Advertisement

వీరిద్దరూ కలిసి నటించిన ఒక సినిమాలో ఒకరికి ఎక్కువ పారితోషకం, మరొకరికి తక్కువ పారితోషకం మాట్లాడుకున్నారు.. ఈ విషయం ఇద్దరికీ తెలియకుండానే నటించారు. దర్శక,నిర్మాతలు కూడా విషయాన్ని బయట పెట్టలేదు. కానీ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరో ఈ విషయాన్ని రాధికకు చెప్పారు. రాధాకు రెమ్యూనరేషన్ అయిదు లక్షల పైగా ఎక్కువ ఇచ్చినట్లు సమాచారం అందింది. దీంతో రాధికకు మరియు రాధాకు గొడవ జరిగింది. ఆ తర్వాత రాధిక సదరు నిర్మాతతో గొడవకు దిగింది.

అంతేకాకుండా నేనే ఎక్కువ సన్నివేశాల్లో నటించాను తక్కువ పారితోషకం అందుకున్నానని ఏకంగా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం మరింత పెద్దది అవ్వకముందే దాసరి నారాయణరావు జోక్యం చేసుకొని నిర్మాతను పిలిచి విషయం అడిగాడు. దీంతో నిర్మాత ఆయన రాధాకు ఎక్కువ డబ్బులు ఇచ్చిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో దాసరి ఆగ్రహానికి గురై రాధికకు అదే రోజు మరో మూడు లక్షలు ఇప్పించి గొడవను అంతటితో ఆపేశారు..

Advertisement

also read:

You may also like