పోలీసులు అంటే చాలామంది భయపడిపోతుంటారు. ముఖ్యంగా పోలీసులు వస్తున్నారు అంటే అయ్యో ఏం జరిగిందో ఎవరిని తీసుకెళ్తారో అనే టెన్షన్ ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నది. కానీ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కూడా కొన్ని లిమిట్స్ నియమ నిబంధనలు ఉంటాయి. వాటి ద్వారా సామాన్య ప్రజలు ఎవరైనా సరే వారి నిబంధనలకు లోబడి పని చేయకపోతే మనం వారిపై కంప్లైంట్ ఇవ్వవచ్చు .
Advertisement
ఈ సమయంలోనే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనం ఇచ్చిన కంప్లైంట్ వారు తిరస్కరిస్తారు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలన్నది ఒకసారి చూద్దాం..? స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులు మన కంప్లైంట్ తీసుకోకపోయినా, ఏదైనా కారణం చెప్పి తిరస్కరించినా వెంటనే ఈ పనిచేయండి. మీరు ఒక ఎన్వలప్ తీసుకొని మీ కంప్లైంట్ రాసి అందులో పెట్టండి. దాన్ని ఆ పోలీస్ స్టేషన్ అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ చేయండి. ఆ పోస్ట్ చేసేటప్పుడు మాత్రం రిసిప్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
Advertisement
తర్వాత మీ కంప్లైంట్ అనేది ఆ పోలీస్ స్టేషన్ కు రీచ్ అవుతుంది. దాని డెలివరీ రిపోర్టు మీరు పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్నికల్ గా మీ కంప్లైంట్ అయితే అక్కడికి చేరుకున్నది. తర్వాత పోలీసులు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ ప్రాసెస్ ను మనం ఏ పోలీస్ స్టేషన్లో అయితే మనం ఇచ్చిన కంప్లైంట్ తిరస్కరిస్తారో ప్రత్యేకంగా ఆ పోలీస్ స్టేషన్ కు ఈ లెటర్ ని పంపించవచ్చు. ఒకవేళ లెటర్ పంపిన తర్వాత కూడా తిరస్కరిస్తే తర్వాత జరిగే పరిణామాలకు పోలీసు అధికారులే బాధ్యులు అవుతారు.
also read;
ఇంజెక్షన్ నరాలకు, శరీర అవయవాలకు ఎందుకు చేస్తారో తెలుసా..?
టాప్ యూట్యూబర్ విక్రమాదిత్య ఎవరో తెలుసా..? అతడి బ్యాగ్రౌండ్ ఏంటంటే..!