టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ గీతగోవిందం సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతనికి బడా నిర్మాణ సంస్థల నుంచి కూడా ఆఫర్లు బాగానే వచ్చాయి. అసలు గీత గోవిందం చిత్రం కంటే ముందు పదేళ్ల నుండి ఈ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ సంస్థలోన ఉంటూ కొన్ని సినిమాలు చేసారు. అల్లు శిరీష్‌తో చేసిన శ్రీరస్తు శుభమస్తు కూడా సూపర్ విజయాన్నే అందుకుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకుడిగా తెరకెక్కించిన మూవీ సర్కారు వారి పాట ఎట్టకేలకు మే 12న భారీగా విడుదలవుతుంది. మహేష్ అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న ఈ చిత్రం విడుదలవతుండడంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో బీజీగా ఉన్నారు. సర్కారు వారి పాట సినిమా కథను తొలుత ఎవర కోసం అనుకున్నారనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా పరశురామ్ అవకాశాలు లేకుండా ఉన్నప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తనకు ఎంతగానో మద్దతుగా నిలిచాడు. ఆ కృతజ్ఞతతోనే గీత గోవిందం వరకు పరశురామ్ చేశారు.
Advertisement
Advertisement
సర్కారు వారి పాట సినిమాను కూడా తొలుత గీత ఆర్ట్స్ బ్యానర్లోనే చేయాలని అనుకున్నట్టు అప్పట్లో టాక్ వినిపించింది. మహేష్ కారణంగా ఆ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించారని వార్తలు వినిపించాయి. తొలుత సర్కారు వారి కథ గీత ఆర్ట్స్‌లో జరిగినప్పుడు ఈ సినిమా కథను మొదట అల్లు అర్జున్ కోసమే అనుకున్నారట. అందుకు నిర్మాత అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా బాగానే ఉన్నప్పటికీ అల్లుఅర్జున్ పుష్ప సినిమా చేయాలనే ఆలోచనలో ఉండడం.. పాన్ ఇండియా రేంజ్లో కొనసాగాలని ప్రస్తుతానికి ఆ కథను చేయలేనని చెప్పేశాడట.
ఇక ఇదే కథను మహేష్ బాబుకు చెప్పడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇలా వీరి కాంబినేషన్ కుదిరింది. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ కథను మహేష్ బాబు కోసం రాసుకున్నట్టు చాలా బలంగానే చెబుతున్నాడు. కానీ మరో టాక్ కథను అల్లు అర్జున్ కోసం రాసినప్పటికీ మహేష్ బాబుకు అనుగుణంగా స్క్రిప్ట్ మార్చినట్టు సమాచారం. మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఎలాంటి ఫలాతాన్ని అందిస్తుందో తెలియాలంటే మే 12 వరకు వేచి చూడాలి.
Also Read :
అవతార్2 ట్రైలర్ వచ్చేసింది.. చూస్తే పిచ్చేక్కాల్సిందే..!
“దోస్తీ” సాంగ్ లో జక్కన్న ఇచ్చిన హింట్ ను గమనించారా..?