గత రెండు రోజులుగా టర్కీ, సిరియాలో భూకంపం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీని దాటికి ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయాల పాలయ్యారు. చాలామంది శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని పక్షుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Advertisement
అయితే అక్కడి భూకంపాన్ని పక్షులు ముందుగానే అంచనా వేశాయని కొందరంటున్నారు. దానికి సంబంధించిన వీడియో పై భిన్న వాదనలు వినిపిస్తున్నా కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కొన్ని జంతువులు, పక్షులు, సముద్ర జీవులు ప్రకృతి విపత్తును ముందుగానే గమనించగలవని, మానవులు ఆ స్వభావాన్ని కోల్పోయారని ఒక నిటిజన్ కామెంట్ పెట్టాడు. ఇక మరో వ్యక్తి మా ఏరియాలో కాకులు కూడా ఇలాగే తిరుగుతాయని మరో నేటిజన్ కామెంట్ పెట్టారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం..
Advertisement
🚨In Turkey, strange behavior was observed in birds just before the earthquake.👀#Turkey #TurkeyEarthquake #Turkish pic.twitter.com/yPnQRaSCRq
— OsintTV📺 (@OsintTV) February 6, 2023
పెద్దపెద్ద భూకంపాలకు ముందు జంతువులు వింతగా ప్రవర్తించడం అనేది పురాతన గ్రీసులో 373 బిసి సమయంలోనే గుర్తించినట్టు సమాచారం. అయితే చాలా రోజుల క్రితం పాములు, ఎలుకలు కొన్ని జంతువులు వినాశకరమైన భూకంపం సంభవించడానికి ముందు అవి ఉండే చోటును విడిచిపెట్టి వెళ్ళాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా భూమికి లోపల బొరియల్లో, గూళ్ళలో ఉండే జంతువులు భూకంపానికి ముందు సంభవించే ప్రకంపనలను గమనించగలవని కొందరు అంటున్నారు.
also read: