Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Sai pallavi: సాయిపల్లవి కూడా లవ్ లో పడిందా.. ఐ లవ్ యు అంటూ ఎమోషనల్..పోస్ట్ వైరల్..!!

Sai pallavi: సాయిపల్లవి కూడా లవ్ లో పడిందా.. ఐ లవ్ యు అంటూ ఎమోషనల్..పోస్ట్ వైరల్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి అంటే తెలియని వారు ఉండరు. ఏ సినిమాలో అయినా తనదైన స్టైల్ లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల హోదాలో చేరింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా కుర్రాళ్ళ గుండెలను పిండేసే ఏకైక ముద్దుగుమ్మ సాయి పల్లవి అని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో లేడి పవర్ స్టార్ గా మంచి గుర్తింపు పొందింది.

Advertisement

Ad

Also Read:లక్నో ఓటమికి కే.ఎల్. రాహుల్ కారణమయ్యాడా ?

ఎప్పుడూ కూడా నటనకు ప్రాధాన్యత ఉండే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే గత కొంతకాలంగా సాయి పల్లవి సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఆమె సినిమాలు మానేసింది అంటూ అనేక రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా సాయి పల్లవి తాజాగా ఒక ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో పంచుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.

Also Read:“దేవుళ్ళు”లో 2జడలు వేసుకొని ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడెలా మారిందంటే..?

తాజాగా తన సిస్టర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకొని ఒక ఎమోషనల్ కోట్ రాసింది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే మంకీ.. మంచి సిస్టర్ కావాలనే తపనతో నన్ను మనిషిగా మార్చి ఎన్నో విషయాలు నేర్పించావు. నా సంతోషానివి, నా ప్రేమ నువ్వే థాంక్యూ చెల్లి ఐ లవ్ యు అంటూ రాస్కొచ్చింది సాయి పల్లవి. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

 

Advertisement

Visitors Are Also Reading