Home » ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పెంచేశారా..!!

ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పెంచేశారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడు సంవత్సరాల నుంచి స్క్రీన్ మీద కనపడకుండా తన అభిమానులను ఊరిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ మూవీ తో థియేటర్ లో సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెయ్యి కోట్ల వసూళ్లతో ఇండియాలోనే ఆల్ టైం వాసూళ్ల రికార్డు స్థానంలో మూడో ప్లేస్ లో కూడా చేరిపోయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు వచ్చింది..

Advertisement

ఇదంతా పక్కన పెడితే నార్త్ లో ఎన్టీఆర్ కు చాలా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో చక చకా ముందుకు పోతున్నాడు. ఇకపై వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్ లో తీసుకురావడానికి టీం కష్టపడుతోంది.

Advertisement

అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తో చాలా క్రేజ్ పెరగడంతో తన పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ కి 45 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం మరో పది కోట్లు పెంచినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే ఈ రెమ్యూనరేషన్ మామూలే కదా.ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ మార్కెట్ లాగా కంటిన్యూ అయితే మాత్రం ఎన్టీఆర్ మరింత ఎత్తుకు వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

‘కేజీఎఫ్ చాప్టర్ 3’ గురించి మరిచిపోండి… ఎందుకంటే..?

జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

హీరో వడ్డే నవీన్ సినిమాలు తీయకపోవడానికి కారణం ఎవరో తెలుసా..!!

 

Visitors Are Also Reading