Home » మీనా భర్త విద్యాసాగర్ ఆస్థిని వారి పేరుమీదే వీలునామా రాశారా.. మీనా పరిస్థితి ఏంటి..?

మీనా భర్త విద్యాసాగర్ ఆస్థిని వారి పేరుమీదే వీలునామా రాశారా.. మీనా పరిస్థితి ఏంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది కోలీవుడ్ బ్యూటీ మీనా. ఆమె మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినా కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా పేరు సంపాదించుకుంది. ఈమె తెలుగులో తీసిన లవ్,ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తూనే ఉంటాయి. ఇప్పటికీ తెలుగు అభిమానుల నుంచి మీనాకు మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలాంటి మీనా జీవితంలో తాజాగా విషాదం ఏర్పడింది. తన భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో మృతి చెంది ఒంటరైపోయింది. విద్యాసాగర్ మృతి చెందినప్పటి నుంచి మీనాకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

 

తాజాగా మరో వార్త తన భర్త విద్యాసాగర్ ఆస్తి గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే తన భర్త తన ఆస్తి అంతా ఒకరి పేరుమీద వీలునామా రాశారననే విషయం బయటకు వస్తోంది. ఆయన తన కూతురు పేరు మీదే తన ఆస్తినంతా వీలునామా రాశారని,గార్డియాన్ గా మీనా ఉన్నందుకు చిన్నా చితక ఆస్తులు తప్ప మరేమీ మీనా పేరు మీద రాయలేదని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆస్తి అంతా తన కూతురు మేజర్ అయ్యాక ఆమె పేరు మీదకే వెళ్తుందని, తర్వాత తన కూతురు ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటుందో ఆ అబ్బాయి కి కూడా సగం ఆస్తి ఇందులో వాటా ఉంటుందని ఆయన వీలునామా రాసినట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ విషయం చూసిన చాలామంది తన భర్తకు ఉన్నటువంటి ముందుచూపుకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా నటి మీనా సినిమాలో నటించడం మానేసి తర్వాత తన భర్తతో కలిసి చాలా వ్యాపారాల్లో కష్టపడి పని చేసింది.తను అనారోగ్యం బారిన పడ్డప్పుడు బ్రతికించు కునేందుకు అనేక ఇబ్బందులు పడిందని, అయినా ఆమెకు ఫలితం లేకుండా చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయిందని చెప్పవచ్చు. కానీ వారి ఆస్తి వీలునామా విషయం మాత్రం బయటకు వచ్చి మీనా చెబితే గాని అసలు విషయం బయటకు రాదు.

ALSO READ:

Visitors Are Also Reading