Home » ఆ హీరోయిన్ కారణంగానే కమల్ హాసన్ సారిక విడిపోయారా ? అసలు ఏం జరిగిందంటే ?

ఆ హీరోయిన్ కారణంగానే కమల్ హాసన్ సారిక విడిపోయారా ? అసలు ఏం జరిగిందంటే ?

by Anji
Ad

భారతదేశంలోనే ఏ పాత్రలోనైనా చాలా అలవొకగా నటించి మెప్పించే సత్తా కొంతమంది నటులకు మాత్రమే ఉంటుంది. అందులో తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు కమల్ హాసన్ ఒకరు. లోకనాయకుడిగా ఈయన చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈయనకు తెలుగులో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది. అందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాలను చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఆయన దిట్టా.

Advertisement

కమల్ హాసన్, నటి సారిక ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో కమల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మరీ సారికని వివాహం చేసుకున్నాడు. అందులో భాగంగానే సారికకు శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరూ పుట్టారు. ఇదిలా ఉంటే..కమల్ హాసన్ తన సినిమాల్లో తనకు జోడిగా నటించిన నటి గౌతమితో ఎక్కువగా సినిమాలను చేశాడు. ఆ సమయంలో వారిద్దరికీ మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి చాలా రోజులూ ఇద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇక విషయం తెలిసిన తరువాత గౌతమిని కలవద్దు అని సారిక కమలహాసన్ కి ఎంత చెప్పినా వినకపోవడంతో అప్పటి సారికనే కమల్ హాసన్ కి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో కమల్ హాసన్ గౌతమికి దగ్గరై తనతోనే ఉండేవాడు.

Advertisement

2004లో కమల్ హాసన్ కి విడాకులు ఇచ్చారు సారిక. అప్పటినుంచి కమల్ హాసన్ గౌతమితోనే ఉంటున్నాడు. రీసెంట్ గా వీరిద్దరి మధ్య బ్రేకప్ అయినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కమల్ హాసన్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా గడుపుతున్నాడు. వీళ్ల వ్యవహారం చూసిన చాలా మంది జనాలు సారికతో కమల్ హాసన్ విడాకులు ఇప్పిస్తే నీకు కూడా కమల్ హాసన్ దక్కలేదు విధి అంటే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమి ఇప్పుడు కొన్ని సినిమాల్ోల చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన లైఫ్ ని లీడ్ వస్తుంది. ఇప్పటివరకు కమల్ హాసన్ కూడా ఒంటరిగానే ఉంటూ సినిమాలు చేస్తున్నాడు. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 చిత్రం చేస్తున్నాడు. దీంతో పాటు ప్రభాస్ కల్కీ మూవీలో విలన్ గా కూడా నటిస్తున్నాడు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading