ఒకప్పుడు తన నటనతో హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది అందాల తార జయప్రద.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి చాలా మంది అభిమానులను సంపాదించుకుంది ఈమె. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలపై దృష్టి తో అందులోకి అరంగేట్రం చేసింది. తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే పలు సినిమాల్లో కొనసాగుతూ వస్తోంది జయప్రద. ఆమె బిజెపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ఆమె ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ తో ఆమెకు ఉన్నటువంటి అనుబంధం గురించి పంచుకుంది.
Advertisement
ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటూనే నాకు ఎన్టీఆర్ రోల్ మోడల్ అని తెలిపింది. చిన్నప్పటినుండి ఆయన్ను చూస్తూ పెరిగాను, ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాక ఎన్టీఆర్ నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలియజేసి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఫోన్ చేసి పార్టీలో చేరమని చెబితే ఆలోచించకుండా టిడిపి పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాను కానీ ఎలాంటి పదవులను కూడా ఆశించలేదు అని, కేవలం ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా ప్రధాన లక్ష్యమని జయప్రద తెలియజేసింది. ఈవిధంగా రాజకీయాల్లో ఉన్న సమయంలో చంద్రబాబు టిడిపిని చేతిలోకి తీసుకున్న వెంటనే ఎన్టీఆర్ ను వదిలి ఎంతో మంది ఎమ్మెల్యేలు బలవంతం మీదనే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబును ఏకీభవించారు. ఈ సందర్భంలో నేను కూడా చంద్రబాబుకు మద్దతు పలికాను. ఇదే నా జీవితం లో మొదటి సారి చేసిన పొరపాటు. ఎన్టీఆర్ నన్ను నమ్మి పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆయన దగ్గర ఉండాల్సిన నేను తప్పుడు నిర్ణయం తీసుకొని బయటకు వచ్చాను అని తెలియజేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో కొనసాగానని, ఆ తర్వాత పార్టీలో అనేక మార్పులు చేర్పుల వల్ల కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, దీంతో పార్టీ వదిలివేసి బయటకు వెళ్లాల్సి వచ్చిందని జయప్రద చెప్పుకొచ్చింది.
Advertisement
ALSO READ;
ఉదయభాను అకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం అదేనా..?
రోహిత్, రాహుల్ పై ఓపెనర్ ఇషాన్ షాకింగ్ కామెంట్స్.. వారిని జట్టులో నుండి తీసేయాలి..!