టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పట్లో అగ్ర హీరోల ఒకరిగా నిలిచి అనేక చిత్రాల్లో అత్యత్తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా ఇలా విభిన్న పాత్రల్లో నటుడు సుమన్ నటించాడు. ముఖ్యంగా దేవుడి పాత్రల్లో కూడా ఆయన ప్రేక్షకులను మెప్పించారు. దక్షిణాది సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. తమిళ చిత్రం రమణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు సుమన్. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ చిత్రంలో కూడా విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్షయ్ కుమార్ నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో దిగ్విజయ్ పాటిల్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సుమన్ ఇటీవల వార్తల్లో నిలిచాడు.
Advertisement
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా భారత సైన్యానికి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే నటుడు సుమన్ స్పందించి వివరణ కూడా ఇచ్చాడు. ఇష్టం వచ్చినట్టు ఎవరికీ వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. 117 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తోందని.. ఈ వివాదం ముగిసి పోయిన తరువాత వ్యక్తిగతంగా తానే స్వయంగా వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు సుమన్.
Advertisement
మరొక వైపు 175 ఎకరాల స్థలంలో ఆయుర్వేద రిసార్ట్ అవుట్ డోర్ స్టూడియోను ప్రారంభించబోతున్నట్టు కొద్ది సంవత్సరాల కిందటే సుమన్ ప్రకటించారు. ఆర్మీ సిబ్బంది సంక్షేమం కోసమే ఈ భూమిని విరాళంగా ఇవ్వాలనే కోరికను ముందు ఉంచినట్టు వెల్లడించారు. ఇక ఆ తరువాత సుమన్ భూమికి సంబంధించిన పత్రాలు కూడా గల్లంతయ్యాయి. సామాజిక కార్యక్రమాలపై ససుమన్ చాలా కృషి చేస్తున్నారనే చెప్పవచ్చు. పుల్వామా అమరవీరుల కోసం ఎన్జీఓ చేపట్టిన కార్యక్రమానికి మద్దతు ప్రకటించడంతో ఈ నటుడికి గౌరవం లభించింది. సమాజాభివృద్ధికి ఎప్పటికప్పుడు తన విలువైన సలహాలు కూడా ఇస్తుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కరాటే పోటీలు నిర్వహించిన పిలవగానే అక్కడికి వచ్చి కొన్ని మెలుకువలు నేర్పిస్తుంటాడు. మరోవైపు సుమన్ ఇదినాది, త్రిశంకు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
Indian Cinema Actor Sri @sumantalwars , Nandi Award winner, the Guest of Honor in the "Award Ceremony" Seva Puraskar Awards has extended his full support for #Pulwama martyrs initiated by @istandforthenation … #AASARA FOUNDATION Let's join the force pic.twitter.com/fUnMUC3d5y
— Istandforthenation (@istandfornation) September 29, 2019
Also Read :
గూగుల్ సంచలన నిర్ణయం.. 9లక్షల యాప్స్ తొలగించేందుకు సిద్ధం..! కారణం ఏమిటంటే..?
ఏపీ పదవతరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే..?