Home » Balakrishna: వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు బాలకృష్ణ డ్రింక్ చేశారా..?

Balakrishna: వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు బాలకృష్ణ డ్రింక్ చేశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాబోతున్న తాజా సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ చేసింది.అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అయితే వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల కాబోతుంది.ఇక సినిమా విడుదలకు కొద్దిరోజులే ఉన్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. అయితే జనవరి 6 శుక్రవారం నాడు వీరసింహారెడ్డి మూవీ యూనిట్ చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలులో నిర్వహించారు.

Advertisement

also read:దర్శకుడు బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..? 

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన బాలకృష్ణకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎన్నడూ లేని విధంగా బాలకృష్ణ ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. ఇక ఈవెంట్లో బాలకృష్ణ బిహేవియర్ అందరినీ ఆశ్చర్యపరిచింది.ఎందుకంటే ఈయన ఎన్నడూ లేని విధంగా ఫుల్ జోష్ తో ఈ ఈవెంట్లో ప్రవర్తించారు. స్టేజ్ పైన చాలా వింతగా బిహేవ్ చేశారు. కొన్ని సందర్భాలలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు మత్తులో మాట్లాడుతున్నట్లు అనిపించింది. అలాగే ఈవెంట్ కి రావడంతోనే చాలామందిని హగ్ చేసుకుంటూ పలకరించడం చూసిన చాలామంది ఏంటి బాలకృష్ణలో ఇంత మార్పు వచ్చింది ఎన్నడు ఇలా చేయలేదే అంటూ షాక్ అవుతున్నారు.

Advertisement

అంతేకాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో చేసిన హనీ రోజ్ దగ్గరికి వచ్చి బాలకృష్ణ ఏకంగా ఆమెను ముద్దు పెట్టుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఆమెను కావాలనే ముద్దు పెట్టుకున్నారా లేదా అలా ఫ్లోలో జరిగిపోయిందా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటోలపై కొంతమంది బాలకృష్ణ ని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు బాలకృష్ణ ఈవెంట్ కి ముందు డ్రి*క్ చేశారు కావచ్చు అందుకే అలా చేశారు అంటూ కొంతమంది బాలకృష్ణపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బాలకృష్ణ గురించి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading