Home » రూ.15 కోట్లకి.. మాజీ వ్యాపార భాగస్వామ్యులపై కేసు వేసిన ధోని..!

రూ.15 కోట్లకి.. మాజీ వ్యాపార భాగస్వామ్యులపై కేసు వేసిన ధోని..!

by Sravya
Ad

ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కి చెందిన ఇద్దరి అధికారుల మీద కేసు నమోదు చేశారు. రాంచి కోర్టు లో క్రిమినల్ కేసు నమోదు చేశారట. ఇక వివరాల్లోకి వెళితే… 2017 క్రికెట్ అకాడమీ డీల్ పై ఆర్కాస్ కోర్స్ మేనేజ్మెంట్ కి చెందిన ఇద్దరు పై ధోని కేసు వేయడం జరిగింది. నిహీర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ ల మీద కేసును నమోదు చేశారు. ధోని 2017 లో దివాకర్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీ నిర్వహించడానికి ధోని తో పాటుగా అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది.

Advertisement

Advertisement

అయితే ఇందులో పేర్కొన్న నిబంధనలకి కట్టుబడలేదని ధోని ఆరోపించారు. రుసుమును చెల్లించి ఒప్పంద నిబంధనలు ప్రకారం వచ్చిన లాభాలని షేర్ చేసుకోవాల్సి ఉంది ఈ నిబంధనని వాళ్ళు పాటించ లేదని ధోని ఆరోపిస్తున్నారు. పైగా పదే పదే వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పినా గుర్తు చేసినా కూస్తో ఏమీ ప్రయోజనం లేదని అన్నారు.

2021 ఆగస్టు మహేంద్ర సింగ్ ధోని ఆ సంస్థకి మంజూరు చేసిన అధికారలేఖని ఉపసంహరించుకున్నారట తర్వాత ధోని వాళ్లకి పలు లీగల్ నోటీసులని కూడా పంపించడం జరిగింది అని ధోని అన్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కూడా లేదని ఆర్క స్పోర్ట్స్ ద్వారా ఆయన మోస పోయానని దయానంద్ సింగ్ ద్వారా ధోని ఆర్క స్పోర్ట్స్ దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది అయితే తమకి 15 కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కొన్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading