Home » Teacher Jobs: ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ ఖాళీలు.. త్వరలోనే !

Teacher Jobs: ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ ఖాళీలు.. త్వరలోనే !

by Bunty
Ad

ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సమావేశాలు ప్రారంభమై వారం గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టాను విప్పిన కేంద్ర ప్రభుత్వం… నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను రివిల్ చేసింది కేంద్ర ప్రభుత్వం.

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న కేంద్రీయ విద్యాలయాల్లో 698 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి డిసెంబర్ 19న లోక్ సభలో వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వీటికి సంబంధించిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఏపీలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 50, 671 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

మొత్తం పోస్టుల్లో 16.64% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అటు తెలంగాణ రాష్ట్రంలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డిసెంబర్ 14న రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులు ఇచ్చారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిఈడి, టిటిసి పూర్తి చేసిన నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి  : ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా…?

Visitors Are Also Reading