Home » క‌డుపుబ్బా న‌వ్వించిన ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం కొడుకు ఇండ‌స్ట్రీలో అన్ని క‌ష్టాలు ప‌డుతున్నాడా..?

క‌డుపుబ్బా న‌వ్వించిన ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం కొడుకు ఇండ‌స్ట్రీలో అన్ని క‌ష్టాలు ప‌డుతున్నాడా..?

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంతమంది నటినటులు భౌతికంగా ప్రేక్ష‌కుల‌కు దూరం అయినా వాళ్ళు చేసిన పాత్రలు మాత్రం ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతాయి. అలా టాలీవుడ్ కు దూరమైన నటులలో లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఒకరు. కమెడియన్ గా ధర్మవరపు సుబ్రమణ్యం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోల‌కు తండ్రి పాత్రలు, కాలేజీ లెక్చరర్ పాత్రల‌కు ధర్మవరపు సుబ్రమణ్యం పెట్టింది పేరు. తనకంటూ ప్రత్యేకమైన యాసతో ధర్మవరపు సుబ్రమణ్యం టాలీవుడ్ లో స్పెషల్ గా నిలిచారు.

Advertisement

స్టైల్ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాస్త శబ్దం వచ్చినా తట్టుకోలేని ఇంటి ఓన‌ర్ పాత్ర‌లో నటించి నవ్వించారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాలో కన్సల్టెన్సీ అధికారి పాత్ర…. అదే విధంగా వర్షం సినిమాలో వాతావరణ శాఖ లో పని చేసే అధికారి పాత్రలో ధర్మవరపు సుబ్రమణ్యం నవ్వులు పూయించారు. ఈ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.

Advertisement

ఇదిలా ఉంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు కూడా సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు రవితేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రవితేజ తను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు చెప్పాడు అంతే కాకుండా తన తండ్రి దగ్గర పనిచేసిన ఓ వ్యక్తి తన‌ను ఇప్పుడు అవమానించాడని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి దగ్గరికి వెళ్లి తాను హీరో అవ్వాలి అనుకుంటున్నానని రిఫరెన్స్ కావాలని అడగ్గా నీ నటన గురించి నాకేం తెలుసు…. రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటూ తనను అవమానించాడని చెప్పాడు.

అప్పుడు తను చాలా బాధపడ్డానని.. తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు అతడికి ఎంతో సాయం చేశాడని అప్పుడు తన తండ్రి సహాయం తీసుకుని ఇప్పుడు తాను ఎవరో కూడా తెలియనట్టు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి సహాయం తో ఎంత ఎత్తుకు ఎదిగినా తిరిగి సహాయం చేసిన వాళ్లను వాళ్ల కుటుంబాన్ని గుర్తుపెట్టుకోవాలని రవి తేజ అన్నాడు. లేదంటే అతడు మనిషి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ధర్మవరపు సబ్రహ్మణ్యం కుమారుడు ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయితే ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

ALSO READ :

బోణీ కపూర్ కంటే ముందు టాలీవుడ్ నుండి శ్రీదేవికి వచ్చిన సంబంధాలు ఏవో తెలుసా…!

Visitors Are Also Reading