స్టార్ హీరో ధనుష్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇతను పేరుకే తమిళ హీరో అయినా తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల పరంగా మంచి ఫామ్ లో ఉన్న ధనుష్ వ్యక్తిగతంగా తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకుని ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పిల్లలు మాత్రం ఇద్దరితో కలిసి ఉంటారు.
Dhanush’s son, who made that mistake in 15 years and got caught
ఈ క్రమంలోనే ధనుష్ పెద్దకొడుకు చేసిన ఓ పని వల్ల ధనుష్ వివాదంలో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే….ధనుష్ పెద్ద కుమారుడు కుమారుడి పేరు యాత్ర రాజా. ఇతని వయసు 15 సంవత్సరాలు. ఇతను అతి చిన్న వయసులోనే స్పోర్ట్స్ బైక్ ని నడిపాడట. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వారు నివసిస్తున్న ఏరియాలో బైక్ ని నడిపాడట. తాను బైక్ నడుపుతున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట.
Advertisement
Advertisement
ఇక ఆ వీడియో మెల్లిమెల్లిగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. దీంతో వారు ధనుష్ కొడుకేనా, కాదా అన్న అనుమానంతో ధనుష్ ఇంటికి వచ్చి క్లారిఫై చేసుకున్నారట. ఆ వ్యక్తి ధనుష్ కొడుకేనని తెలిసి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకుగాను రూ. 1000 రూపాయలు జరిమానా విధించారట. పొరపాటున తప్పు చేసినప్పటికీ కూడా అది తప్పేనని ట్రాఫిక్ పోలీసులు ధనుష్ తో చెప్పడం జరిగింది. దీంతో ధనుష్ కూడా వారు చెప్పిన విధంగానే ఫైన్ ని కట్టారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!