Telugu News » Blog » IPL 2022: ఐపీఎల్ లో తొలి బంతికే విరాట్ వికెట్ తీసిన బేబీ ఏబీడీ…

IPL 2022: ఐపీఎల్ లో తొలి బంతికే విరాట్ వికెట్ తీసిన బేబీ ఏబీడీ…

by Manohar Reddy Mano
Ads

ఐపీఎల్ 2022 లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై సూర్య కుమార్ యాదవ్ (68) రాణించడంతో నిర్ణిత ఓవర్లలో 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో వచ్చిన బెంగళూర్ జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ప్రారంభంలోనే నిష్క్రమించాడు. కానీ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అనుజ్ రావత్ భాగస్వామ్యం ఆర్సీబీ మ్యాచ్‌ను సునాయాసంగా గెలిచేలా చేసింది.

Advertisement

అయితే చాలా రోజులుగా ఫామ్ లేకుండా ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్ లో 48 పరుగులు చేసి అర్ధశతకం అందుకోకుండా పెవిలియన్ చేరుకున్నాడు. బేబీ ఏబీడీగా పేరుపొందిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రీవిస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన మొదటి బంతికే విరాట్ వికెట్ ను అందుకున్నాడు. బ్రేవిస్ వేసిన 19 ఓవర్ తొలి బంతిని విరాట్ కోహ్లీ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ను… ప్యాడ్‌ను ఒకేసారి తాకింది. దాంతో ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే కోహ్లీ రివ్యూ తీసుకున్న.. అది ఫలించలేదు.

Advertisement

గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ముంబై జట్టు తలపడినప్పుడు.. ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి స్టంపౌట్​గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ లో బ్యాట్ తో ఆకట్టుకున్న.. బేబీ ఏబీడీ ఈ మ్యాచ్ లో బంతితో కూడా మెరిసాడు. అయితే ఐపీఎల్ 2022 లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.

Advertisement

Also Read: క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే 5 జెర్సీ నెంబర్లు..!