Home » 2 రెండు రోజులు తిండి త‌ప్ప‌లు మానేసి ఏడుస్తూ కూర్చున్నా..దేవినాగ‌వ‌ల్లి ఎమోష‌న‌ల్..1

2 రెండు రోజులు తిండి త‌ప్ప‌లు మానేసి ఏడుస్తూ కూర్చున్నా..దేవినాగ‌వ‌ల్లి ఎమోష‌న‌ల్..1

by AJAY
Ad

దేవి నాగ‌వ‌ల్లి ప్ర‌స్తుతం ఈ పేరు వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారింది. నిజానికి వార్త‌లు చెప్పాల్సిన దేవి నాగ‌వ‌ల్లే గ‌త రెండు రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోంది. యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం అనే సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ డిఫ‌రెంట్ గా నిర్వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఓ సోష‌ల్ మీడియా స్టార్ అర్జున్ ఎవ‌రు అంటూ ఆత్మ‌హ‌త్య చేసుకుంటా అంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టుగా ప్రాంక్ చేశాడు. ఈ ప్రాంక్ ను రోడ్డు పై చేశారు.

Advertisement

కాగా ఓ లాయర్ దీనిపై ఫిర్యాదు చేశారు. దాంతో టీవీ 9 ఈ వార్త‌ను మోగించింది. ఈ క్ర‌మంలో దేవినాగ‌వ‌ల్లి విశ్వ‌క్ సేన్ ను పాగ‌ల్ సేన్ అంటార‌ని అత‌డిని డిప్రెష‌న్ లో ఉన్నాడ‌ని కూడా అంటారని కామెంట్లు చేసింది. దాంతో నేరుగా టీవీ 9 స్టూడియోకు వెళ్లిన విశ్వ‌క్ సేన్ దేవి నాగ‌వ‌ల్లి పై ఫైర్ అయ్యాడు. త‌న‌ను పాగ‌ల్ సేన్ అన‌డానికి ఎలాంటి హ‌క్కులు ఉన్నాయ‌ని మైండ్ యువ‌ర్ టంగ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Advertisement

అంతే కాకుండా ఎఫ్ ప‌దం వాడుతూ దూషించాడు. అయితే ఈ విష‌యంలో కొంద‌రు దేవి నాగ‌వ‌ల్లికి స‌పోర్ట్ చేస్తే మ‌రికొంద‌రు విశ్వక్ సేన్ కు స‌పోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి స‌మయంలో దేవినాగ‌వ‌ల్లిని అభిమానించేవారు ఆమె బిగ్ బాస్ కు వెళ్లే ముందు సోష‌ల్ మీడియాలో త‌న వ్య‌క్తి గ‌త జీవితం గురించి అదే విధంగా మీడియా రంగ‌లోకి ఎలా అడుగు పెట్టాను అనే దాని గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

ఆ వీడియోలో తాను ఓ సారి ఒక వార్త‌ను రెండు కోణాల‌లో చూడ‌కుండా ఒకే కోణంలో చూశాన‌ని..ఒక వైపు నుండే ప్ర‌జెంట్ చేశాన‌ని చెప్పింది. ఆ త‌ర‌వాత అది త‌ప్పు అని తెలిసింద‌ని పేర్కొంది. దాంతో రెండు రోజులు ఏడ్చాన‌ని అన్నం కూడా తిన‌కుండా ఏడ్చేశాన‌ని చెప్పింది. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ALSO READ :

దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

చెల్లి దారిలోనే చందమామ…సినిమాలకు ఇక సెలవు…!

Visitors Are Also Reading