Home » దేవిపుత్రుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏ చేస్తుందంటే..?

దేవిపుత్రుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏ చేస్తుందంటే..?

by AJAY
Ad

వెంక‌టేష్ కెరీర్ లోని సూప‌ర్ హిట్ చిత్రాల‌లో దేవిపుత్రుడు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో వెంక‌టేష్ కు జోడీగా సౌంద‌ర్య న‌టించింది. ఈ చిత్రానికి కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న‌మైన క‌థ‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ అందించిన స్వ‌రాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి.

Advertisement

ఇక ఈ సినిమా 2001లో విడుద‌ల కాగా అప్ప‌ట్లో దేవిపుత్రుడు లాంటి సినిమాలు రావ‌డం చాలా అరుదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకుంది. త‌న క్యూట్ ఎక్పెప్రెష‌న్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది.చాలా మంది ఆ చైల్డ్ ఆర్టిస్ట్ న‌ట‌న చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంత చిన్న‌వ‌య‌సులోనే సూప‌ర్ గా న‌టిస్తుంద‌ని అనుకున్నారు. అలా ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న‌ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు తిమోతియా కాగా ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పెరిగి పెద్ద‌ది అయ్యింది.

Advertisement

అంతేకాకుండా చూడ్డానికి అచ్చం హీరోయ‌న్ లా క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఆ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో న‌టించేందుకు కూడా రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. సినిమాల కోసం న‌ట‌న‌లో మ‌రియు డ్యాన్స్ లో విదేశాల‌కు వెళ్లి శిక్ష‌ణ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇక ఇప్ప‌టికే టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన వాళ్లు హీరోలు హీరోయిన్ లు గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.

హీరో త‌రుణ్ ఒక‌ప్పుడు చాలా సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడు. అంతే కాకుండా త‌నిష్ కూడా ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గానే న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఆకాష్ పూరీ, తేజ స‌జ్జాలు సైతం చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన‌వారే. మ‌రి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తిమోతియా ఏమేర‌కు రానిస్తుందో చూడాలి.

ALSO READ : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఎదురుదెబ్బ‌.. ఒకే ఏడాది రెండు ఘ‌ట‌న‌లు..!

Visitors Are Also Reading