Home » భారీ అంచనాలతో విడుదలైన ‘దేవి పుత్రుడు’ బాహుబలి మించి గ్రాఫిక్స్ ఎందుకు ప్లాప్ అయ్యింది.. ?

భారీ అంచనాలతో విడుదలైన ‘దేవి పుత్రుడు’ బాహుబలి మించి గ్రాఫిక్స్ ఎందుకు ప్లాప్ అయ్యింది.. ?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు వారసుడిగా కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు 2001 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా వచ్చిన కలిసుందాం రా.! అదే ఏడాదిలో వచ్చిన జయం మనదేరా! సినిమాలు సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకటేష్. మరో పక్క ఆవిడే శ్యామల, దేవుళ్లు వంటి హిట్లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు దర్శకుడు కోడి రామకృష్ణ. వీరి కాంబినేషన్ లో ఆల్రెడీ శత్రువు అనే సూపర్ హిట్ సినిమా కూడా వచ్చింది.

Advertisement

మరి అలాంటప్పుడు వీరి కాంబినేషన్ లో మరోసారి సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఊహించుకోవచ్చు. ఇండస్ట్రీలో రికార్డులు కొట్టడమే బ్యాలెన్స్ అన్నట్లు విడుదల తేదీ రానే వచ్చింది. అనుకున్నట్లుగానే 2001లో జనవరి 13న దేవిపుత్రుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. మణిశర్మ పాటలు విడుదల కు ముందే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం ఆ పాటలు ఎక్కడా కనిపించలేదు. సినిమాకి ఎమ్. ఎస్.రాజు గారు డబ్బులు మంచినీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టారని సినిమాలోని ప్రతి విజువల్ చెబుతోంది.

Advertisement

టెక్నాలజీ ఏ మాత్రం అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఆ గ్రాఫిక్స్ ని కోడి రామకృష్ణ ఎలా ప్రజెంట్ చేశాడో అని ఎవరికీ అర్థం కాలేదు. ఇన్ని హైలెట్స్ ఉన్నా కూడా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం కథనాన్ని ఆసక్తిగా నడపకపోవడం వల్లనేనా లేక దేవి పుత్రుడు రాంగ్ టైంలో విడుదలవ్వడం వల్లనా అనేది ఇప్పటికీ జవాబు దొరకడం లేదు. మరోవైపు దేవి పుత్రుడు సినిమాకి పోటీగా చిరంజీవి మృగరాజు సినిమా కూడా డిజాస్టర్ కాగా బాలక్రిష్ణ నరసింహనాయుడు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కానీ బుల్లితెర పై దేవిపుత్రుడు సినిమాను చూసి బాగుందనే వారు చాలా మందే ఉన్నారు. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి.

ఇవి చ‌ద‌వండి :

ఎన్టీఆర్ యాక్టింగ్ కి పడిపోయా.. ఖచ్చితంగా ఆ అవార్డు ఇవ్వాలంటున్న శిల్పశెట్టి..!!

 

Visitors Are Also Reading