Home » “దేవి పుత్రుడు” చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…!

“దేవి పుత్రుడు” చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…!

by AJAY
Ad

సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లు దొర‌క‌డం చాలా క‌ష్టం. న‌టీన‌టులు బోలెడు మంది దొరుకుతారు కానీ చ‌క్క‌గా న‌టించే చెప్పిన‌ట్టు వినే చైల్డ్ ఆర్టిస్ట్ లు దొర‌కడం మాత్రం చాలా క‌ష్టం. అందువ‌ల్లే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉంటారు కానీ అతికొద్ది మందిని మాత్ర‌మే ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకుంటారు. ఇక ఒక‌ప్ప‌టి చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు పెద్ద‌వాళ్లు అయిపోయారు.

Advertisement

అలా దేవిపుత్రుడు సినిమాతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న చిన్నారి వేగ త‌యోతియా కూడా ఇప్పుడు గుర్తుప‌ట్ట‌రానంత‌గా మారిపోయింది. దేవి పుత్రుడు సినిమాలో ఈ చిన్నారి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. క్యూట్ క్యూట్ మాట‌ల‌తో అంద‌రినీ ఫిదా చేసింది. దేవిపుత్రుడు సినిమాలో వెంక‌టేష్ హీరోగా న‌టించగా సౌంద‌ర్య‌, అంజ‌నా జువేరి హీరోయిన్ లుగా న‌టించారు.

Advertisement

ఈ సినిమాకు కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా 2001లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమా వ‌చ్చి 20 ఏళ్లు దాటింది కాబ‌ట్టి చైల్డ్ ఆర్టిస్ట్ వేగ త‌యోతియా వ‌య‌సు కూడా పెరిగిపోయింది. అంతే కాకుండా ఎంతో అందంగా మారిపోయి కుర్రాళ్ల మ‌న‌సుదోచేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో న‌టించిన వేగ విదేశాల్లో చ‌దుకుంది.

ఆ త‌ర‌వాత తిరిగి ఇండియా వ‌చ్చి 2009లో వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. కానీ ఈ సినిమా అనుకున్న మేర హిట్ అవ్వ‌లేదు. ఆ త‌వ‌రాత మ‌రికొన్ని సినిమాల్లో కూడా న‌టించి కానీ ఏ సినిమా కూడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కు గుర్తింపు తెచ్చిపెట్ట‌లేదు. చివ‌రగా 2019లో వేగ త‌మెతియా ఓ వెబ్ సిరిస్ లో న‌టించింది. ఆ త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యింది.

Visitors Are Also Reading