పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దేవయాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కి ఓ అమాయకపు కూతురిగా అద్భుతంగా నటించి తన అమాయకత్వంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. దేవయాని ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. దేవయాని తండ్రి ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, తల్లి గృహిణి. దేవయాని చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులతో పదవ తరగతి వరకు చదువుకుంది.
ఓ సినిమాలో చిన్న క్యారెక్టర్ గురించి తెలుసుకున్న దేవయాని మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవయాని బాలీవుడ్ లో అవకాశాన్ని అందుకొని సినిమాల్లో నటించింది. ఇక తాను నటించిన చాలా సినిమాలు హిట్ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తాను అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఇక దేవయాని 2001 సంవత్సరంలో తమిళ దర్శకుడు రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి కుటుంబ సభ్యులను ఎదిరించి వివాహం చేసుకుంది.
Advertisement
Advertisement
ఇక వివాహానంతరం దేవయాని ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డారట. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇక సినిమాలో ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో దేవయాని ఏం చేయాలో తెలియక తాను టీచర్ గా జాబ్ చేస్తుంది. తన పిల్లలు చదివే స్కూల్ లోనే అన్నాసాలైలో గల చర్చ్ పార్క్ స్కూల్లో నర్సరీ పిల్లలకు టీచర్ గా పని చేస్తుంది. టీచర్ గా చేయడం తనకెంతో ఇష్టమని, తన పిల్లలు చదువుతున్న స్కూల్లోనే తాను టీచరుగా పనిచేస్తుందట. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి దేవయాని మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
- ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త
- పవన్ కల్యాణ్ నటికి విడాకులు .. పెళ్లైన ఏడాదికే భర్తకు దూరంగా..?
- 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే ?