ప్రతిగ్రహం నిర్థిష్ట సమయంలో రాశిని మార్చుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తుంది. దీనినే గ్రహాల రాశి పరివర్తనం అంటారు. గ్రహాల రాశి మార్పు, తిరోగమన ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొందరి శుభాలు కలిగితే మరికొందరికీ ఇబ్బందులు వస్తాయి. గ్రహాలు, నక్షత్రాల స్థానాల పరంగా జులై లో దేవగురు బృహస్పతి తిరోగమనం చెందుతుంది. . జులై 29న బృహస్పతి తిరోగమనం చెందుతుంది. నవంబర్ 24, 2022 తిరిగి సాధారణ స్థితికి తిరిగి వస్తుంది. అంతకంటే ముందు అక్టోబర్‌లో బృహస్పతి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువును సంపద, వైభవం, పిల్లలు, ఆనందం, అభ్యాసం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. మరి గురుగ్రహ తిరోగమనం వల్ల ఏ రాశి వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.
Advertisement
వృషభం :
Advertisement
దేవ గురువు బృహస్పతి మీ రాశిచక్రంలోని 11వ ఇంట్లో తిరోగమనం చేయబోతున్నాడు. ఆదాయానికి సంబంధించిన గృహం. అందువల్ల బృహస్పతి సంచారం మీకు అదృష్టం తీసుకొస్తుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. వ్యాపారులు ధనలాభం పొందుతారు. ఆఫీస్‌లో పని తీరు మెరుగుపడడం వల్ల అందరి ప్రశంసలు అందుతాయి.
మిథునం :
బృహస్పతి తిరోగమనం మిథున రాశి వారి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీ ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. జీతం పెరగవచ్చు. మీరు కొత్త వ్యాపార సంబంధాల ద్వారా ప్రయోజనం పొందుతారు. బృహస్పతి తిరోగమనం వల్ల వీరు ఓ శుభవార్త వింటారు.
కర్కాటకం :
బృహస్పతి కర్కాటక రాశి వ్యక్తుల 9వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరగవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు పెట్టుబడి లాభాన్ని పొందవచ్చు. తండ్రి నుండి పూర్తి సహాయక సహకారాలుంటాయి.