Home » శేషాచ‌లం ఎర్ర‌చంద‌నానికి డిమాండ్ ఎందుకు ఉంటుందో తెలుసా..?

శేషాచ‌లం ఎర్ర‌చంద‌నానికి డిమాండ్ ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Anji
Ad

ఎర్ర‌చంద‌నం చెట్లు ప్ర‌పంచంలోనే చాలా అరుదైన జాతికి చెందిన‌వి. ఇవి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు, క‌డ‌ప‌, నెల్లూరు, క‌ర్నూలు జిల్లాల‌లో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డి శేషాచ‌లం అట‌వీ ప్రాంతంలో పెరిగే ఎర్ర‌చంద‌నానికి అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న‌ది. అయితే ఈ ఎర్ర‌చంద‌నం ఎందుకు అంత డిమాండ్. ప్రాణాల‌కు తెగించి మ‌రీ స్మ‌గ్ల‌ర్ దీనిని ఎందుకు ర‌వాణా చేస్తుంటారు..? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Kadapa: ఎర్రచందనం దొంగల ముఠా అరెస్ట్ | Red Sandalwood Gang Arrested in  Kadapa

Advertisement

ఎర్ర‌చంద‌నం యొక్క శాస్త్రీయ నామం టెరోకార్పస్ శాంటాలినస్ తెలుగులో దీనిని ర‌క్త‌చంద‌నం లేదా ఎర్ర‌బంగారం అని కూడా పిలుస్తుంటారు. ఏ ఖండంలో ఇది లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శేషాచ‌లం అడ‌వుల్లో ఎక్కువ‌గా ఉంటుంది. చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప జిల్లాల‌లో ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని శేషాచ‌లం కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో చాలా నాణ్య‌మైన ఎర్ర‌చంద‌నం ల‌భిస్తుంది. ఇక్క‌డి నేల స్వ‌భావంతోనే నాణ్య‌మైన ఎర్ర‌చంద‌నం ల‌భిస్తుంటుంది అంటున్నారు నిపుణులు.

Indian Red Sandalwood at Rs 9500/kilogram | Red Sandalwood | ID: 8487016388

ఇత‌ర ప్రాంతాల్లో దీనిని పెంచుతున్న‌ప్ప‌టికీ అవి నాణ్యంగా ఉండ‌డం లేదు. నాణ్య‌తను గ్రేడ్‌లుగా విభ‌జిస్తారు అని ఓ ప్రొఫెస‌ర్ తెలిపారు. రైతులు పెంచుతున్నారు అక్క‌డ‌క్క‌డ‌. కానీ ఇంత క్వాలిటీ రావ‌డం లేదు. 20 సంవ‌త్స‌రాలు స‌మ‌యం ప‌డుతుంది శేషాచ‌లం అడ‌వుల్లో పెరిగితే.. అదే బ‌య‌ట పెరిగితే మాత్రం 30 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఇక్క‌డి ఎర్ర‌చంద‌నానికి చైనా, జ‌పాన్‌, ర‌ష్యా, మ‌లేషియా, సింగ‌పూర్ వంటి దేశాల్లో డిమాండ్ ఉంది. నౌక‌ద్వారా విదేశాల‌కు ఎర్ర‌చంద‌నాన్ని అక్ర‌మ ర‌వాణా చేస్తున్నార‌ని అట‌వీశాఖ తెలిపింది.

Advertisement

Vaartha Online Edition ఎడిటోరియల్

వీర‌ప్ప‌న్ చ‌నిపోయిన త‌రువాత 30 నుంచి 40వేల మంది ఉంటారు. దేనికి భ‌య‌ప‌డ‌రు. స్మ‌గ్లింగ్‌లో ర‌క‌ర‌కాలుగా ఉంటారు. మొత్తం వివిధ‌ ర‌కాలుగా ఉంటారు. మొద‌టిస్థాయిలో క‌ర్ర‌లు కొట్టే వారు ఉంటే., రెండ‌వ స్థాయిలో ట్రాన్స్ పోర్ట్ చేసేవారు మూడ‌వ స్థాయిలో ఒక‌చోట డంప్ చేసే వారు నాలుగు, ఐదు స్థానాల్లో బ‌డాబాబులుంటారు. కొంత మంది కూలీల‌తో కొట్టించే వారు. అస‌లు ఎవ‌రు కొట్టిస్తున్నారో కొట్టే వారికి మాత్రం తెలియ‌దు. వారికి కూలీ వ‌స్తే చాలు అనుకొని కూలివెళ్లేవారు. ప‌లు సంద‌ర్భాల్లో పోలీసులు కేసులు బ‌నాయించ‌డంతో అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లవుతున్నారు.

ర‌ష్యా, చైనా, జ‌పాన్, మ‌లేషియా దేశాల్లో ఎర్ర‌చంద‌నంతో త‌యారు చేసిన వ‌స్తువుల‌కు విప‌రీతంగా డిమాండ్ ఉంది. వుడ్ తో త‌యారు చేసిన బొమ్మ‌లు చైనా, జ‌పాన్‌ల‌లో ప్ర‌తీ ఇంట్లో ఉంటాయ‌ట‌. ర‌ష్యాలో కూడా ఉడ్‌కు బాగానే గిరాకీ ఉంది. వ‌యాగ్రాలో వాడ‌డం, కాస్మోటిక్స్‌, ఫేస్‌క్రిమ్‌లు, అల్స‌ర్ త‌గ్గించే గుణం, తానిక‌, కిడ్రీ ప్రాబ్ల‌మ్స్ ను కూడా క్లియ‌ర్ చేస్తాయ‌ట. ఎర్ర‌చంద‌నం. యాంటిస్మ‌గ్ల‌ర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అక్ర‌మ ర‌వాణా చేస్తున్న కూలీల‌ను ప‌ట్టుకొని కేసులు న‌మోదు చేస్తున్న‌ట్టు పోలీస్ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. 2015లో టాస్క్ ఫోర్స్ డీఐజీ, ఎస్పీ, కొంత మంది స్టాప్‌ను నియ‌మించారు. పోలీస్, ఫారెస్ట్‌, ఏపీఎస్పీ, ఆర్‌, సివిల్ ఫోర్స్‌తో ఏర్పాటు చేసారు. ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌నే స‌మాచారం అంద‌గానే పోలీసులు స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్ట్ చేస్తారు అని అధికారి వివ‌రించారు.

Visitors Are Also Reading