ఐపీఎల్ కు సంబంధించినంతవరకు రెండు రోజుల క్రితం ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదే ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియామకం. రోహిత్ శర్మను తొలగించడం చాలా మందికి నచ్చలేదు. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇస్తేనే గుజరాత్ నుంచి వస్తానని హార్దిక్ పాండ్యా కండిషన్ పెట్టడం.
దానికి ముంబై ఒప్పుకొని రోహిత్ శర్మకు చెప్పిందని చాలా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఈ సీజన్ జట్టు మారతాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబైకి ట్రేడ్ అవ్వగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రోహిత్ శర్మ ట్రేడ్ కోసం ప్రయత్నించిందని, కానీ కాంట్రాక్ట్ వల్ల డీల్ కుదరలేదని కొన్ని వార్తాసంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి.
Advertisement
మరోవైపు సోషల్ మీడియాలో వివిధ జట్ల ఫ్యాన్స్ మాత్రం రోహిత్ ముంబైని వదిలేసి ఆర్సిబి, సీఎస్కే, సన్రైజర్స్ వంటి జట్లకు వచ్చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతానికైతే రోహిత్ ముంబై తరపున ఆడేటట్టుగా కనిపిస్తున్నాడు. కానీ 19వ తేదీన వేలం ముగిశాక 20వ తేదీ నుంచి మళ్లీ ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ సమయంలో ఏదైనా జరగొచ్చని… సంచలనం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.