Telugu News » రామ్‌గోపాల్ వ‌ర్మ పోస్ట్‌ను షేర్ చేసిన దీప్తి.. అందుకు కౌంట‌ర్ వేసిందా..?

రామ్‌గోపాల్ వ‌ర్మ పోస్ట్‌ను షేర్ చేసిన దీప్తి.. అందుకు కౌంట‌ర్ వేసిందా..?

by Anji

రామ్ గోపాల్ వ‌ర్మ పేరు వింటేనే అది ఒక సంచ‌ల‌నం. అత‌నికి వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు అనే బిరుదు కూడా క‌ల‌దు. ఇటీవ‌ల వ‌ర్మ ఏపీలో సినిమా టికెట్ల గురించి జ‌రుగుతున్న వార్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ముఖ్యంగా వ‌ర్మ ఎప్పుడు ఎవ‌రి మీద సెటైర్ వేస్తాడో అస్స‌లు ఊహించ‌రు. ఎందుకు ట్వీట్లు చేస్తాడ‌ని విష‌యం ఎవ్వ‌రికీ అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది. ముఖ్యంగా వోడ్కా ఎక్కువై ఉంటుంది..? ఇంకా దిగ‌లేదేమో.. అందుకే ఇలా అర్థ‌రాత్రి పూట అని ట్వీట్ చేస్తుంటాడ‌ని కొంద‌రూ సెటైర్లు కూడా వేస్తుంటారు. సోమ‌వారం రాత్రి, మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌రుస‌గా ట్వీట్ల యుద్ధం చేసాడు వ‌ర్మ‌. వ‌ర్మ చేసిన ఈ ట్వీట్లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

Ads

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన  దీప్తి సునయన.. | Deepthi sunaina breakup with shanmukh jashwanth social  media post goes viral | TV9 Telugu

ఎందుకు ఇలా వ‌ర్మ వాస్త‌వాలు చెబుతున్నాడ‌ని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న కాలంలో నిజాలు చెప్పే మ‌నుషులు ద్వేషిస్తున్నారు. అబద్దాలు చెప్పే వ్య‌క్తుల‌ను ప్రేమిస్తున్నారు. వ‌చ్చిన స‌మ‌స్య అదే అని ఒక ట్వీట్ వేశాడు. మ‌రొక ట్వీట్‌లో మ‌నుషులంద‌రూ కూడా అబ‌ద్దాల‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే అవి నిజాల కంటే ఎంతో క‌ఫ‌ర్ట్‌గా ఉంటాయి. నిజం అంద‌రినీ ఇలా అంద‌రి ప‌రువు తీస్తుంటుంది. అబ‌ద్దం దానిని కాపాడుతుంది అని ఓ ఫిలాస‌ఫీని చెప్పాడు వ‌ర్మ‌.

My arrogance was the reason for my flops: Ram Gopal Varmaఆర్జీవీ చెప్పిన ఈ మాట‌లు దీప్తి సున‌య‌న‌కు బాగా న‌చ్చిన‌ట్టుంది. త‌న ఇన్‌స్టా స్టోరీలో మ‌నుషులంతా కూడా అబ‌ద్దాల‌నే ఇష్ట‌ప‌డుతుంటారు అని.. అవి నిజాల‌కంటే ఎంతో కంఫ‌ర్ట్‌గా ఉంటాయి. అని ఆర్జీవీ చేసిన ట్వీట్ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌ను చూస్తుంటే ష‌న్నుకి సెటైర్ వేసిన‌ట్టుగానే అనిపిస్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య చాలా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ష‌న్నుని మాత్రం దీప్తి చాలా దూరంగానే పెడుతోంది. కానీ ష‌న్ను మాత్రం దీప్తితో క‌లిసుండాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.


You may also like