Home » ష‌ణ్ముక్ తో బ్రేకప్..మేం విడిపోతున్నామంటూ దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్..!

ష‌ణ్ముక్ తో బ్రేకప్..మేం విడిపోతున్నామంటూ దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్..!

by AJAY
Ad

సోష‌ల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముక్ గ‌త ఐదేళ్లుగా ప్రేమాయ‌ణం నడిపించిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి ఫోటోలు షేర్ చేయ‌డం. క‌లిసి క‌వ‌ర్ సాంగ్ లు చేయ‌డం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఇక ఈ జంట‌కు ఎంతో మంది అభిమానులు కూడా అయ్యారు. ఒక సినిమా సెల‌బ్రెటీల జంట‌కు ఉన్న రేంజ్ లో వీరికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక గ‌తంలో దీప్తి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమ‌యంలో ష‌ణ్ముక్ స‌పోర్ట్ చేశాడు.

deepthi sunaina shanmuk breakup

deepthi sunaina shanmuk breakup

రీసెంట్ గా ష‌ణ్ముక్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌గా దీప్తి అత‌డికి స‌పోర్ట్ చేసింది. కానీ ష‌ణ్ముక్ హౌస్ లో సిరితో కాస్త ఎక్కువ క్లోజ్ గా ఉండ‌టం హ‌గ్గులు, ముద్దులు దీప్తి జీర్ణించుకోలేక‌పోయింది అనే వాద‌న వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రూ విడిపోతార‌ని దీప్తి ష‌ణ్ముక్ ను బ్లాక్ చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు అనుకున్న‌దే జ‌రిగింది. ఇద్ద‌రూ విడిపోయామంటూ దీప్తి త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ ఎమోష‌నల్ పోస్ట్ ను షేర్ చేసింది.

Advertisement

Advertisement

deepthi sunaina shanmuk breakup

deepthi sunaina shanmuk breakup

దీప్తి త‌న సోష‌ల్ మీడియాలో….”నా శ్రేయోభిలాషుల‌కు స్నేహితుల‌కు చెబుతున్నా..ఎంతో ఆలోచించిన త‌ర‌వాత ష‌ణ్ముక్ నేను విడిపోతున్నాం. ఐదు సంవ‌త్స‌రాలు మేము హ్యాపీగా ఉన్నాం..ప్రేమ ఎదుగుద‌ల స‌మ‌యంలో మాలోని రాక్ష‌సుల‌తో పోరాటం చేయ‌డం క‌ష్టం అయ్యింది. మీరు కోరుకున్న‌ట్టే మేం ఇద్ద‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. క‌లిసి ఉండ‌టానికి ప్ర‌య‌త్నించి మా జీవితాల‌ను విస్మ‌రించాం. మా ఇద్ద‌రి మార్గాలు వేర‌ని తెలుసుకున్నాం. అందుకే విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఈ స‌మ‌యంలో మీరు మాకు అండ‌గా ఉండండి మా ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌వ‌ద్దు.” అంటూ దీప్తి ఎమోష‌న‌ల్ అయ్యింది.

https://www.instagram.com/p/CYJ-4Hchc08/?utm_source=ig_web_copy_link

 

also read : మీ కొడుకులకు నేర్పించండి కూతుళ్లకు కాదు..మరోసారి సమంత హాట్ కామెంట్స్…!

Visitors Are Also Reading