దీప్తి సూనైనా అంటే సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు డబ్స్మాష్ ద్వారా దీప్తి అభిమానులను సంపాదించుకుంది. ఆ తరవాత ఇన్స్టా , యూట్యూబ్ లో కూడా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. దీప్తి సాధారణ కాలేజీ స్టూడెంట్ గా పరిచయం అయ్యి ఆ తరవాత సినిమా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
Advertisement
deepthi sunaina
కొంతమంది హీరోయిన్ ల కంటే దీప్తి సునైనా కే సోషల్ మీడియా లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. మిలియన్స్ కొద్ది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న దీప్తి సునైనా ప్రస్తుతం సినిమా లలో కూడా నటిస్తుంది. నిఖిల్ హీరోగా నటించిన కిరిక్ పార్టీ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. తరవాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది.
Advertisement
deepthi sunaina shanmuk
అంతే కాకుండా బిగ్ బాస్ రియాలిటీ టివి షో లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ లో మాత్రం విన్నర్ అవ్వలేకపోయింది. అంతే కాకుండా దీప్తి సునైనా అప్పట్లో యుట్యూబర్ షణ్ముక్ తో ప్రేమాయణం నడిపి వార్తల్లో హాట్ టాపిక్ మారింది. ఇక వీరిద్దరి మధ్య బ్రేకప్ కు బిగ్ బాస్ కారణం అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా స్టార్స్ కూడా సినిమా తారల రేంజ్ లో సంపాదిస్తున్నారు. ఇక దీప్తి కూడా భారీగానే సంపాదించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రీసెంట్ గా కొత్త ఇంటిని కొనుగోలు చేసి గృహ ప్రవేశం చేసింది.
ఇదిలా ఉంటే దీప్తి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా….మీరు కొత్త ఇల్లు కొన్నారు….అంత డబ్బు ఎక్కడిది అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దానికి దీప్తి…..నేను యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన తరవాత సంపాదించిన దానిలో కేవలం 30శాతం ఖర్చు పెట్టి 70 శాతం దాచుకున్నా…వాటితోనే ఇల్లు కట్టుకున్నా…అంటూ కౌంటర్ ఇచ్చింది.
Advertisement
Also read : కాబోయే భర్తను ఉద్యోగం నుంచి తొలగించిన ‘మైక్రోసాప్ట్’.. పెళ్లి చేసుకోమంటారా..?