Telugu News » ప్రాజెక్టు “కె” కోసం హైదరాబాద్‌కు దీపిక..

ప్రాజెక్టు “కె” కోసం హైదరాబాద్‌కు దీపిక..

by Bunty
Ad

బాలీవుడ్‌ నటి దీపిక పదుకునే ప్రాజెక్టు కె మూవీ కోసం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ మూవీని మహనటి ఫేం నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌లో దీపిక నటిస్తుంది. దీపిక నేరుగా హైద్రాబాద్‌ ఎయిర్‌పోర్టులో లావెండ్‌ బ్లెజర్‌ ప్యాంట్‌ ధరించింది. ఈ చిత్ర మొదటి షెడ్యూల్‌ను హైద్రాబాద్‌ పరిసరా ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. మూవీ చిత్రికరణ అనంతరం ముంబై వెళ్లునున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లోని షకున్‌ బాత్రా చిత్రంలో దీపిక నటించాల్సి ఉంది. ఈ చిత్రం ఇంకా డబ్బింగ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లోఉంది.

Advertisement

Advertisement


దీని అనంతరం ఇతర చిత్రాలకు ఆమె కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌ కె మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం మహనటి చిత్రం ఫేం నాగ్‌ అశ్విన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించడమే కారణం. అంతేకాకుండా భారీ బడ్జెట్‌ చిత్రం అవ్వడం, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌, ప్రభాస్‌, దీపిక నటిస్తుండటంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌, ఆదిపురుష్‌ చిత్రాల షూటింగ్‌తో బీజీగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభాస్‌ రాధేశ్యాం మూవీ ప్రమోషన్‌ వేడుకల్లో బీజీగా ఉన్నారు. దీంతో ఈ ఆ చిత్రాల బ్రేక్‌ సమయంలో ఈ చిత్ర షూటింగ్‌ను మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సీటీలో ప్రత్యేక సెట్‌ వేసి రేపటి నుంచి మూవీ చిత్రికరణను శరవేగంగా జరపనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కోసం దీపిక ఎగ్జైంటింగ్‌గా ఎదురు చూస్తోంది.

Visitors Are Also Reading