సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తూ ఉంటారు. చాలామంది రెండు, మూడు సినిమాలు చేసి ఆ తర్వాత సరైన ఆఫర్లు లేకపోవడంతో కనుమరుగు అవుతుంటారు. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా సరైన ఆఫర్లు లేకపోతే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే.
Advertisement
read also : వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?
అలాంటి హీరోయిన్ లలో దీక్షాసేథ్ ఒకరు అని చెప్పాలి. దీక్షాసేత్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు, కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ సినిమా హీరోయిన్ అనగానే టక్కున ఓ ఆ హీరోయినా అని అనేస్తారు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ వేదం సినిమా తర్వాత సెకండ్ హీరోయిన్ గా మిరపకాయ్, రెబల్ చిత్రాల్లో దర్శనమిచ్చింది. ఇక ఈ సినిమాలో అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
Advertisement
తర్వాత హీరోయిన్ గా వాంటెడ్, నిప్పు, ఊ కొడతావా, ఉలిక్కి పడతావా లాంటి సినిమాలు చేసిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో టాలీవుడ్ కు నిదానంగా దూరమైంది. 2014లో లేకర్ హామ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత వచ్చిన జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అదే ఏడాది హిందీలో మరొక సినిమాలో కూడా నటించింది. కానీ ఆ సినిమాలు దీక్ష కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. ఈ సినిమాల తరువాత దీక్షాసేథ్ ఏ సినిమాలోను నటించలేదు. ప్రస్తుతం ఈమె ఏం చేస్తుందో ఎవరికి తెలియదు.
Advertisement
read also : వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?