Home » Dec 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయ్యింది. ఈనెల 6న ట్విట్టర్‌లో అయోధ్యపై పోస్ట్‌ చేసిన రాజాసింగ్‌. వివాదాస్పద పోస్ట్‌పై సంజాయిషీ కోరుతూ రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు షరతులను ఉల్లంఘించారంటూ పోలీసులు నోటీసులు అందజేశారు.

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్రంలో కారు బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొన్న కారు…ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మృతులు శివరాంపురం వాసులుగా గుర్తించారు.

Advertisement


వారాహిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదు అని స్పష్టం చేశారు.

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురు చనిపోయారు. 50 మందికి గాయాలు కాగా మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

గవర్నర్‌ తమిళిసైకి అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement


చిత్తూరు మాండూస్ తుఫాన్‌ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు.

నేటి నుంచి పాకిస్థాన్‌తో ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌ జరగనుంది. నేడు ఉదయం 10.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

నేడు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు శంకుస్థాపన జరగనుంది. మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శబరిమలకు లక్షలాదిగా భక్తులు చేరుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచి కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

నేడు మధ్యాహ్నం 1.20కి బీఆర్ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

Visitors Are Also Reading