Home » Dec 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

modi

147 స్థానాల్లో గుజరాత్‌లో బీజేపీ జయభేరి మోగిస్తోంది. ఫలించిన మోడీ గుజరాత్‌ భూమి పుత్రుడు నినాదం.. రాష్ట్రంలో ఏడోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుంది.

Advertisement

గుజరాత్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.

ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల్లో ఏపీ అగ్రస్థానం లో నిలిచింది.

సైబర్ నేరాల కేసుల్లో దేశం లోనే తెలంగాణ నంబర్ వన్ స్థానం లో నిలిచింది.

ఏపీలో పలు జిల్లాలకు మాండూస్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఉంది. బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారిన వాయుగుండం.. రేపు సాయంత్రానికి తీరందాటే అవకాశం.. మూడు రోజుల పాటు దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తిరుపతి పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. లక్ష్మయ్య ఊరుసమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు, ఒక డ్రైవర్, ఇద్దరు చిన్నపిల్లలు దుర్మరణం చెందారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 19 సబ్జెక్ట్ ల్లో 247 ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఈనెల 14 నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

రెండో వన్డేలో భారత్ ఓటమి పాలయింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ లో చివరి వరకూ పోరాడి భారత్ ఓడింది. 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

గుంటూరు మెడికల్ విద్యార్థిని తపస్విని హతమార్చిన కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆరవ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టులో జ్ఞానేశ్వర్ ను పోలీసులు హాజరుపరిచారు. ఈనెల 21 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

తెలంగాణ అనేక రంగాల్లో ఇప్పటికే దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని…దేశానికే ఆదర్శంగా అనేక పనులు చేసి చూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. గురుకుల విద్యలో మనకు మనమే సాటి, ఎవరూ లేరు పోటీ అంటూ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading