Home » Dec 30th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 30th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆన్లైన్ ద్వారా హైకోర్టులో రికార్డుల డిజిటలేషన్ ప్రాజెక్టులను సుప్రీంకోర్టు సీజేఐ ప్రారంభించారు. ఆన్లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సాఫ్ట్ వేర్ అప్లికేషన్ న్యూట్రల్ సైటేషన్ ప్రారంభించారు.

నేడు ఈడీ విచారణపై తన‌ న్యాయవాదుల‌తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చర్చించనున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి చెబుతున్నారు.

Advertisement

హైదరాబాద్ చంచల్ గూడ జైల్ నుండి రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల అయ్యారు. నకిలీ పాస్ పోర్ట్ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర భారతి.. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల.. నిన్న బెయిల్ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ కు తీవ్రగాయాలయ్యాయి. రూర్కీ దగ్గర డివైడర్ ను ఢీకొట్టిన రిషబ్ పంత్ కారు.. రూర్కీ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.

యాదాద్రిలో నేడు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులకు, సిబ్బంది, అర్చకులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 120కి పైగా ఆలయ అధికారులకు, సిబ్బంది, అర్చకులకు కోవిడ్ పరీక్షల నిర్వహించారు.

Advertisement

తిరుమల 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 26 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,156 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,452 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు.

ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ కన్ను మూశారు. కాగా తల్లి హీరాబెన్ మోడీ పాడె మోశారు.

ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యతించనున్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు శంఖుస్థాపన.. రూ.1000 కోట్లతో మెడికల్ కాలేజ్, ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన ప్రభుత్వం…జోగునాథుని పాలెంలో బహిరంగ సభ ను ఏర్పాటు చేయనున్నారు.

Visitors Are Also Reading