Home » Dec 22nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 22nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్ లో నేడు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి దిగ్విజయ్‌సింగ్ తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై ఆయ‌న చర్చించారు.

modi
క‌రోనా కొత్త వేరియంట్ తో కేంద్రం అప్రమత్తం అయ్యింది. నేడు మధ్యాహ్నం ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 గా ఉంది.

తిరుమలలో 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 68,469 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి పిటిషన్లపై హైకోర్టులో విచారణ జ‌ర‌గ‌నుంది.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నేటి నుంచి జనవరి 1వ తేదీ వరకు బుక్‌ఫెయిర్ జ‌ర‌గ‌నుంది. 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

నేడు ఉదయం 11.30 గంటలకు గాంధీ భవన్‌కు దిగ్విజయ్‌సింగ్ రానున్నారు. టి.కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో భేటీ కానున్నారు. ప్రతి ఒక్కరితో విడివిడిగా దిగ్విజయ్ మాట్లాడ‌నున్నారు.

హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ పర్చూరు కొచ్చికి బదిలీ అయ్యారు. హైదరాబాద్ ఈడీ కొత్త జాయింట్ డైరెక్టర్‌గా రోహిత్ ఆనంద్ నియామకం అయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లోని మంజీరా కెమికల్స్‌లో ఐటీ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. గుంటూరు, రాజమండ్రిలో మంజీరా కెమికల్స్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. మంజీరా కెమికల్స్ డైరెక్టర్ సురేష్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వ‌హిస్తోంది.

Visitors Are Also Reading