Home » Dec 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 4 గం.లకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ నేషనల్ స్పోర్ట్స్ మీట్-2022 జరగనుంది. గిరిజన గురుకులాల జాతీయ క్రీడలకు ఏపీ ఆతిథ్యం వహిస్తోంది. డిసెంబర్ 17 నుంచి 22 వరకు గిరిజన గురుకులాల జాతీయ క్రీడలు జరగనున్నాయి. 22 రాష్ట్రాల నుంచి 4,300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

నెల్లూరు కోర్టులో చోరీపై విచారణ ప్రారంభించిన CBI అధికారులు.. కోర్టు బెంచ్ క్లర్క్ నాగేశ్వర రావు, పాలనాధికారిని ప్రశ్నిస్తున్న అధికారులు… చిన్న బజార్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించనున్నారు. ఈ రోజు నిందితులను అధికారులు ప్రశ్నించనున్నారు.

Advertisement

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్ కన్నన్ పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ గౌరవ వందనాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్ కన్నన్ స్వీకరించారు.

హైదరాబాద్ పాత బస్తీ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేరుకున్నారు. బెంగుళూరు మాదకద్రవ్యాల కేసులో తనకు నోటీసులు వచ్చాయని అంటున్న బండి సంజయ్ కు అక్కడి నుంచి సవాల్ విసరనున్నారు.

Advertisement

మాచర్లలో నిన్న విధ్వంసానికి గురైన టీడీపీ నేతల ఇళ్లకు పోలీసులు చేరుకున్నారు. నిన్నటి ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.30-40 మంది వైసీపీ కార్యకర్తలు తమ ఇళ్లల్లోకి జొరబడ్డారని, దాడిలో నగదు.. బంగారం దోచుకెళ్లారని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

హైదరాబాద్ వచ్చే వారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం లేదా మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకున్నాయి. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.

గుంటూరు మాచర్లలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పల్నాడు,ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ లు జరిగాయి. మాజీ మంత్రి ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తిరుపతి కోడిపందేలు ఆడుతున్న సమయంలో పోలీసులు రావడంతో కాలువలోకి దూకిన యువకుడు మనోహర్‌..గజ ఈతగాళ్లు వెతకడం తో మృతదేహం లభ్యం.

Ap cm jagan

Ap cm jagan

గడపగడపకు ప్రభుత్వంలో వెనుకబడ్డ 32మంది ఎమ్మెల్యేలపై ‘సీఎం జగన్ సీరియస్‌ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ వరకు సీఎం జగన్ డెడ్‌లైన్‌ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని సీఎం జగన్‌ హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading