Home » దాసరి చేయాలనుకుంది ఒకటి చేయలేక పోయారు.. అది ఏంటో తెలుసా..?

దాసరి చేయాలనుకుంది ఒకటి చేయలేక పోయారు.. అది ఏంటో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ ఇలా భాష ఏదైనా సరే స్టార్ డైరెక్టర్ కానీ, హీరోలు, నిర్మాతలు కానీ తమ వారసత్వాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఇప్పుడున్న సెలబ్రిటీలలో సగానికి పైగా ఉన్నది వారసత్వమే. సీనియర్ దర్శకులు నిర్మాతలు హీరోలు తమ పిల్లలను హీరోలుగా హీరోయిన్ గా పరిచయం చేయాలని స్టార్ స్టేటస్ సంపాదించుకుంటే అది చూసి ఆనందించాలని కలలు కంటుంటారు. కొందరి విషయంలో ఇది సాధ్యపడదు. స్టార్ కిడ్స్ అయినా అడ్రస్ వెతుక్కోవాల్సి వస్తుంది.

Advertisement

అలాంటి వారిలో దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించిన దర్శక రత్న దాసరి నారాయణరావు కొడుకు దాసరి అరుణ్ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కోవాల్సిన పరిస్థితి. దాసరి నారాయణ రావు ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులను, హీరోలను తీసుకొచ్చి లైప్ ఇచ్చారు. స్టార్ దర్శకుడు ఆయన కోడి రామకృష్ణ, రేలంగి, నరసింహారావు లాంటివారు దాసరి శిష్యులే కావడం విశేషం. మంచు మోహన్ బాబుని ఈ స్థాయికి తీసుకొచ్చిన దర్శకులు దాసరి నారాయణరావు గారే. ఇంతమంది స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన దాసరి తన కొడుకుని స్టార్ ని చేయలేకపోయారు. హీరోగా పరిచయం చేశారు కానీ స్టార్ హీరోగా నిలబెట్ట లేకపోయారు. సినిమాలు చేసిన పెద్ద హీరో కాదు కదా కనీసం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సెటిల్ అవ్వలేకపోయారు.

Advertisement

Also Read :  నయనతార- విఘ్నేష్ శివన్ ల ప్రేమ కథలో ఇంత ట్విస్ట్ ఉందా ?

కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఆయనకు పేరు తెచ్చినవి ఏమి లేవు. సినీ, రాజకీయ నాయకుడిగా ఎంతోమంది సక్సెస్ ని ఎన్నో అవార్డులను అందుకున్నారు. మాత్రం కొడుకు సక్సెస్ ని చూడలేకపోయారు. కొడుకు గురించే ఎప్పుడు దిగులుగా ఉండేది. దాసరి నారాయణరావుకి ఒక కలగా తీరని కోరిక ఉండిపోయింది. మోహన్ బాబు లాంటి హీరో దగ్గర ఎన్నోసార్లు దాసరి ఈ విషయాన్ని చర్చించి బాధపడ్డారు. ఇండస్ట్రీలో నా కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టబోయే లేకపోయానని ఫీల్ అయ్యేవారు అట. ఇప్పటికైనా కొడుకును పెద్ద హీరోగా చూడాలనేదే నా కోరిక అనేవారు. దాసరి అరుణ్ కుమార్ ఏవేవో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Also Read :  మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్.. అనుకున్నట్టే దీపావళి బ్లాస్ట్..!

 

Visitors Are Also Reading