ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. సంచలనాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టిన సీఎం జగన్.. తాజాగా మరో కీలక నిర్నయం తీసుకున్నారు. టీటీడీలో టాలీవుడ్ కు స్థానం కల్పించారు. కలియుగ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులకు బోర్డు సభ్యులుగా నియామకం చేపడుతున్నది.
READ ALSO : తెలంగాణ యూట్యూబర్ ‘శ్రీ’ పెళ్లి.. సబ్‌స్క్రైబర్స్ నుంచి రూ.4 కోట్ల కట్నాలు!
Advertisement
ఈ క్రమంలోనే నిర్మాత కిరణ్ కుమార్ కు ఏపీ సర్కార్ గౌరవ పదవిని కట్టబెట్టింది. తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దపీట వేయాలని, అలాగే పరిశ్రమ నుంచి ఒకరికి ప్రాతినిధ్యం వహించేలా చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం టీటీడీ బోర్డులో మొత్తం 24 మంది సభ్యులకు స్థానం ఉంది. ఇప్పటివరకు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిసి 19 మందిగా ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను 24కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఇక తాజాగా 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. చాలామంది టీటీడీ బోర్డులో సభ్యుడు కావాలనే జీవితాశయం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ ను ఈ అదృష్టం వరించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి నిర్మాత కిరణ్ కుమార్ స్నేహితుడు, అత్యంత సన్నిహితుడు. ఈ సందర్భంగా తనను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్, ఎంపీ బాలశౌరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక “నేను జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని. ఈ నియామకంతో విధేయుడికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు” అంటూ ఈ సందర్భంగా దాసరి కిరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ఆర్జీవీ తీస్తున్న వ్యూహం సినిమాకు దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్య మంత్రి @ysjagan గారి చేత టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికకాబడ్డ నా “వ్యూహం” ప్రొడ్యూసర్ @dkkzoomin గారికి అతి పెద్ద కంగ్రాట్స్💐💐💐💐💐 pic.twitter.com/dRmgcnynzM
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2022