Home » ఏపీ లో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి…!

ఏపీ లో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి…!

by Sravya
Ad

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేసిన విషయం తెలిసిందే నిరుద్యోగుల గొంతుకులా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి బర్రెలక్క బరిలోకి దిగింది బర్రెలక్క అలియాస్ శిరీష స్ఫూర్తితోనే ఇంకో యువతి ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత అలియాస్ జూమ్ చక జూమ్ చక అనే యూట్యూబ్ స్టార్ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పింది తన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆమెని గెలిపించాలని ఇందుకు సంబంధించిన మ్యానిఫెస్టో విడుదల చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Advertisement

దాసరి కవిత సొంతంగా యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఫేమస్ అయిపోయింది. 2024 ఎలక్షన్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దాసరి కవిత చెప్పింది. తమ నియోజకవర్గాన్ని చాలా సమస్యలు వెంటాడుతున్నాయని ఇప్పటికి కూడా అవి అలాగే ఉన్నాయని ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఎవరూ వాళ్ళ సమస్యల్ని గట్టెక్కించట్లేదని అందుకే తానే స్వయంగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు దాసరి కవిత చెప్పింది.

Advertisement

ఈ క్రమంలోనే ధర్మవరంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ని ఓడించడమే తన లక్ష్యమని చెప్పింది. ఎక్కువమంది నిరుద్యోగ యువత వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారని వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది ఆమెను గెలిపిస్తే ప్రతి మండలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ సెంటర్ లని నిర్వహిస్తానని నియోజకవర్గంలో 50 వేల మందికి పైగా చేనేత కార్మికులు వలస వెళ్లిపోయారని, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం కోసం హ్యాండ్లూమ్ మగ్గాలని ఏర్పాటు చేస్తానని చెప్పింది అలానే అధిక ఫీజులు, మంచినీటి సమస్యల్ని కూడా తీరుస్తానని అని చెప్పుకొచ్చింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading