Home » దసరా రూమర్స్ పై డైరెక్టర్ కౌంటర్…!

దసరా రూమర్స్ పై డైరెక్టర్ కౌంటర్…!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా తర్వాత ప్రతి హీరో మూడు, నాలుగు సినిమాలను ఒక్కేసారి లైన్ లో పెట్టుకుంటున్నారు. కానీ కరోనా కంటే ముందునుండే ఈ పద్ధతినీ ఫాలో అవుతున్న హీరో ఎవరు అంటే నాని. మొదట సినిమాలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన నాని.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా పరిచయమై.. ఈరోజు నాచురల్ స్టార్ నానిగా అభిమానుల ప్రేమను సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టాలు పడిన నాని.. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా… ఎప్పుడు వరుస సినిమాలు చేస్తుంటే ఉంటాడు. అయితే తాజాగా నాని నుండి అభిమానుల ముందుకు వచ్చిన సినిమా అంటే సుందరానికి.

Advertisement

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే ఈసారి కొంత డీలా పడిన నాని.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం దసరా పైనే పెట్టాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తెలంగాణలోని గోదావరి లోని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ఇది కథకు తగ్గిన విధంగా ఈ సినిమాకు నాని తన లుక్ మొత్తని చేంజ్ చేసుకొని.. మొత్తం పక్క మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. యతే ఇప్పుడు నాని ఆశలు మొత్తం ఈ సినిమాపైనే ఉన్నాయి.

Advertisement

అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా… నెమ్మదిగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా మిగితా నాని సినిమాల కంటే ఆలస్యం అవుతుండటంతో దీని పై చాలా పుకార్లు అనే వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఇన్ని రోజులు బడ్జెట్ లో వచ్చిన సమస్య వల్ల ఆగిపోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ పై దర్శకుడు శ్రీకాంత్ ఓడేలా తనదైనరీతిలో స్పందించాడు. ఇలాంటి కామెంట్ చేసిన ఓ వ్యక్తికి బ్రహ్మానందం క్లిప్ ఒక్కటి పంపించాడు. అందువల్ల ఈ వార్తలు అన్ని ఫెక్ అని దర్శకుడు చెప్పేసాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ సెంచరీలు కాకుండా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి…!

టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading