Telugu News » Blog » Das Ka Dhamki Trailer : దాస్ కా ధమ్కీ మరో ట్రైలర్ వచ్చేసింది

Das Ka Dhamki Trailer : దాస్ కా ధమ్కీ మరో ట్రైలర్ వచ్చేసింది

by Bunty
Ads

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దమ్కీ. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది విశ్వక్సేన్ ప్లాన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి హాట్ బ్యూటీ నివేత పేతురాజ్, విశ్వక్సేన్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా దమ్కీ ట్రైలర్ విడుదలైంది. ఫన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో సాగే కన్ఫ్యూషన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Advertisement

READ ALSO : చైనాలో పురుగుల వర్షం… ఏదైనా డ్రాగన్ సిటీకి సాధ్యం!

Advertisement

ఈ చిత్రంలో విశ్వక్సేన్ మెడికల్ సైంటిస్ట్ గా, బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ గాలికి తిరిగే డ్యూయల్ రోల్ లో విశ్వక్సేన్ నటిస్తున్నాడు. గాలికి తిరిగే కుర్రాడు సైంటిస్ట్ అవతారం ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు మొదలయ్యే కన్ఫ్యూజన్ మంచి ఫన్ జనరేట్ చేస్తోంది. అసలు ఈ రెండు పాత్రల మధ్య సంబంధం ఏంటి అనే ఉత్కంఠ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఎప్పటిలాగే విశ్వక్సేన్ తన మాస్ యాటిట్యూడ్ తో అదరగొడుతున్నాడు.

read also : Sir Movie : సార్ మూవీ ఓటింగ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Trailer of Vishwak Sen's Das Ka Dhamki out- Cinema express

ఇక నివేత పేతురాజు మునిపెన్నడూ లేనివిధంగా గ్లామర్ ఒలకబోస్తూ విశ్వక్సేన్ తో మంచి కెమిస్ట్రీ పండించింది. మీరు పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే, కానీ ఇప్పుడు పిచ్ మొత్తం ఖాళీగా ఉంది అంటూ నివేత చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులు, విశ్వక్సేన్ ట్రైలర్ చివర్లో చెప్పే బూతు డైలాగుపై సోషల్ మీడియాలో చర్చ జరగడం ఖాయం. కాకపోతే చిత్రం మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు.

Advertisement