Home » ధనుష్ వెంకీ అట్లూరి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

ధనుష్ వెంకీ అట్లూరి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

by AJAY
Ad

విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించే హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఒకరు. తనకు కథ నచ్చితే చాలు సినిమాలో ఎలాంటి పాత్ర పోషించడానికి అయినా ధనుష్ ముందుకు వస్తారు. దానికి రఘువరన్ బీటెక్ సినిమానే నిదర్శనం. ఈ సినిమా బీటెక్ పూర్తి చేసిన ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందో చెబుతోంది. సినిమాలో ఎలాంటి స్టైలిస్ట్ లుక్ లేకుండా మిడిల్ క్లాస్ యువకుడు ఇలాంటి కష్టాలు పడతాడో అలాంటి కష్టాలు పడుతూ ధనుష్ కనిపిస్తాడు.

Nani venky atluri movie title

Nani venky atluri movie title

ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినప్పటికీ ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో మంచి విజయం సాధించింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ధనుష్ ఎంతో దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు ధనుష్ తెలుగు దర్శకులతో సినిమాలు చేయడం విశేషం. ధనుష్ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా… అందులో ఒక సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. మరో సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారు.

Advertisement

Advertisement

తమిళంలో ఈ సినిమాకు “వాతి” అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా….. తెలుగులో “సార్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిర్మాత నాగ వంశీ- సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఉన్నట్టు సమాచారం. వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు ధనుష్ ను ఒప్పించి గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. మరి ఆ లక్కీ ఛాన్స్ ను వెంకీ అట్లూరి ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

Visitors Are Also Reading