Telugu News » Danush Aishwarya : విడాకులు ప్రకటించిన స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్యా రజినీకాంత్…షాక్ లో ఫ్యాన్స్….!

Danush Aishwarya : విడాకులు ప్రకటించిన స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్యా రజినీకాంత్…షాక్ లో ఫ్యాన్స్….!

by AJAY MADDIBOINA

తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వరతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఐశ్వర్య రజినీ ఖాంత్ కూతురు కాగా ధనుష్ తో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకున్నట్టు ప్రకటించడం ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. అసలు ఏం జరిగిందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు రజినీ కాంత్ ఫ్యాన్స్ మరోవైపు ధనుష్ ఫ్యాన్స్ విడాకుల విషయం విని షాక్ అయ్యారు.

Ads
Danush Aishwarya

Danush Aishwarya

విడాకులు తీసుకున్నట్టు ధనుష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ లేఖలో….18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్య భర్తలు గా, తల్లి తండ్రులు గా కలిసి ఉన్నాం. మా జర్నీ అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం లా సాగిపోయింది. ఈ రోజు మేము వేరు వేరు దారుల్లో నిలబడి ఉన్నాము. ఐశ్వర్య నేను భార్య భర్థలుగా విడిపోవాలని అనుకుంటున్నాం. విడిపోతేనే మంచిది అని నిర్ణయించుకున్నాము. మా నిర్ణయాన్ని గౌరవించి మాకు ప్రైవసీ ఇవ్వగలరు. ఓం నమశివాయ అంటూ ధనుష్ తన లేఖలో పేర్కొన్నారు.


You may also like