ఇండియా, పాకిస్థాన్ మధ్య గత ఆదివారం ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు. కాబట్టి ఆ సమయంలో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
Advertisement
అలా మెల్లిగా ఇన్నింగ్స్ అనేది నిర్మిస్తూ.. రోహిత్ శర్మతో అర్ద శతక భాగసౌమ్యం అనేది నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కోహ్లీ ప్రదర్శనతో హ్యాపీగానే ఉన్నారు. కానీ తేజః పాకిస్థాన్ మాజీ ఆటగాడు మాత్రం కోహ్లీ అంత గొప్పగా ఏం ఆడలేదు అని కామెంట్స్ చేసాడు. నాకు అతను ఓ మాములు ఆటగాడిగా కనిపించాడు అని అన్నాడు.
Advertisement
పాక్ మాజీ స్పిన్నర్ డేనిష్ కనేరియా కోహ్లీ గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ కంటే ముంచేందు చాలా రెస్ట్ అనేది వచ్చింది. కాబట్టి ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ కూడా కోహ్లీపైనే తా ఫోకస్ అనేది పెట్టారు. కానీ విరాట్ మాత్రం వారిని నిరాశపరిచాడు. కోహ్లీ బ్యాటింగ్ లో నాకు ఎంత పస అనేది కనిపించలేదు. ఓ సాధారణ ఆటగాడిగా కోహ్లీ ఆడాడు అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :