Ad
ఈ నెల 27 నుండి యూఏఈ వేదికగా ఆసియా కప్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే 28న దాయాది దేశాలు అయిన ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ హై హొల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో రెండు దేశాల జట్లకు చాలా మంది మాజీలు సూచనలు అనేవి ఇస్తులే ఉన్నారు. ఇక తాజాగా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ కనేరియా కూడా ఇండియాకు కొన్ని సలహాలు ఇచ్చాడు.
డేనిష్ కనేరియా మాట్లాడుతూ.. ఈ ఆసియా కప్ టోర్నీల భారత జట్టుకు ఓపెనర్ గా కేఎల్ రాహుల్ వద్దు అని చెప్పాడు. రోహిత్ తో కలిసి ఈ టోర్నీలో సూర్య కుమార్ యాదవ్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అని పేర్కొన్నాడు. సూర్య కుమార్ తాజాగా ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్ గా బాగా రాణించాడు. కాబట్టి ఇప్పుడు కూడా అతనే ఓపెనర్ గా ఉండాలి అని చెప్పాడు.
అయితే రాహుల్ జట్టులో ఏ స్థానంలో అయిన బ్యాటింగ్ చేయగలడు. గతంలో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బాగా రాణించాడు అని కనేరియా గుర్తు చేసాడు. ఇక ఇండియా ఫ్యాన్స్ కూడా ఇదే అనుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై ఇండియా ఓడిపోవటానికి రోహిత్, రాహుల్ వైఫల్యం కారణం అని భావిస్తున్న అభిమానులు… రాహుల్ ఇన్ని రోజులు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. కాబట్టి సూర్యనే ఓపెనింగ్ పంపాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
తన కొత్త జట్టును ప్రకటించిన ఎంఐ..!
పాకిస్థాన్ పరువు తీసిన సెహ్వాగ్..!
Advertisement